నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి అరెస్ట్! పరిస్థితి ఉద్రిక్తత!

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు.

దీంతో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు స్టేషన్ కి వచ్చి ఆందోళన చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

అసలు విషయంలోకి వెళ్తే నెల్లూరులో ఓట్ల తొలగింపుకి పాల్పడుతున్నారు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు.ఓట్ల తొలగించే ప్రయత్నం చేసిన వారిపై యాక్షన్ తీసుకోవడం లేదని ఆరోపిస్తూ కోటంరెడ్డి స్టేషన్ లో పోలీసులతో వాగ్వాదంకి దిగారు.

దీంతో పోలీసుల అనంతరం ఆయన తన ఇంటికి వెళ్ళిపోయారు.అయితే పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించే ప్రయత్నం చేసారు.

అయితే ఆయన తన ఇంటి నుంచి అనుచరులతో కలిసి పాదయాత్రగా తరలి వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.అనతరం తాను బెయిల్ వచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తా అని కోటంరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించి తనని అరెస్ట్ చేసారని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తా అని పేర్కొన్నారు.అయితే కోటంరెడ్డి అరెస్ట్ తో నెల్లూరు పోలీస్ దగ్గర ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకి దిగారు.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు