ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన శ్రమదానం కార్యక్రమం.ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హిట్ పెంచేసింది.
రాజమండ్రి బ్రిడ్జి పై ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చూసిన పవన్ కి.ప్రభుత్వం నుండి అనుమతులు రాలేదు.కరోనా కారణంగా ఇటువంటి పరిస్థితుల్లో.అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.ఈ తరుణంలో సభాస్థలి మార్చి శ్రమదానం కార్యక్రమం చేపట్టిన పవన్.వైసీపీ నాయకుల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తోలు తీస్తా, ప్రభుత్వాన్ని కూల్చేస్తా, వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వస్తా.అంటూ తనదైన శైలిలో పవన్ ప్రసంగించారు.
ఈ క్రమంలో పనిచేసిన కామెంట్లకు వైసిపి నాయకులు ప్రతిస్పందిస్తూ ఉన్నారు.
తాజాగా ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పవన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనవసరంగా అతని పట్టించుకుని పెద్దవాన్ని చేస్తున్నారని అన్నారు.రాజకీయ చతురత లేదా అనుభవం అతని లో ఏముందని ప్రశ్నించారు.
రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి అని సెటైర్లు వేశారు.ఎక్కడా కూడా నిలకడ ఉండదు అని పేర్కొన్నారు.
తిరుపతి ఉప ఎన్నికల టైంలో.బీజేపీతో కలిసి ప్రయాణించి.
అదే సమయంలో టిడిపికి ఓటు వేయించాడు పవన్ అంటూ ఆయనపై ఆరోపణలు చేశారు ధర్మాన కృష్ణదాస్.కేవలం నామమాత్రంగా ఓటు వేయించ శక్తి మాత్రమే పవన్ కి ఉందని రాజకీయ పార్టీని పెట్టి ఏదో తన అభిమానులతో పార్ట్టైమ్ రాజకీయాలు చేస్తున్నారు అంటూ… ఇండస్ట్రీ వాళ్ళు అతన్ని లైట్ గా తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
మరోపక్క ఇదే క్రమంలో.చంద్రబాబు తో అనైతికంగా పొత్తు పెట్టుకొని.పవన్ కళ్యాణ్ పైకి కలరింగ్ ఇస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.చివరాకరికి చంద్రబాబుతో చేతులు కలిపి.
వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి పవన్ ఇప్పటి నుండే.ప్రయత్నాలు స్టార్ట్ చేశారని వైసీపీ నేతలు అంటున్నారు.
ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబు కి గాని పవన్ కళ్యాణ్ కి గాని లేదని.ఎంతమంది వచ్చినా వచ్చే ఎన్నికలలో జగన్ మళ్లీ ఒంటరిగా పోటీ చేస్తారని వైసీపీ నేతలు పవన్ ఎపిసోడ్ పై కత్తి గా రియాక్ట్ అవుతున్నారు.