ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది.అంతకంటే ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో వైసిపి ( ycp )ప్రభుత్వం ఉందనే వార్తలు గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
దీంతో అప్పుడే ఎన్నికల సందడి మొదలైపోయిందా అన్నట్లుగా ఏపీ రాజకీయం ఉంది.ముందస్తు ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా , గెలిచి తీరాలనే పట్టుదల అటు అధికార పార్టీలోను, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం , జనసేన, బిజెపిలలో కనిపిస్తోంది.
విడివిడిగా ఎన్నికలకు వెళ్తే పరాభవం తప్పదని భావిస్తున్న వైసిపి వ్యతిరేక పార్టీలన్నీ పొత్తు పెట్టుకునే ఆలోచనలు ఉన్నాయి.ఇది ఇలా ఉంటే ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు అధికార పార్టీ వైసిపి అనేక వ్యూహాలకు తెరతీస్తోంది.

దీనిలో భాగంగానే ఏపీ వ్యాప్తంగా ప్రతి ఇంటికి స్టిక్కర్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది.ప్రతి ఇంటికి స్టిక్కర్లతో పాటు, ప్రజలు వాడుతున్న సెల్ ఫోన్ లకు స్టిక్కర్ల(Stickers)ను అతికించే కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతోంది .ఈ మేరకు రేపు శనివారం నుంచి ఐదు రోజులపాటు మండల పార్టీ ఇన్చార్జీలు, సచివాలయ సమన్వయకర్తలు , గృహ సారధులు, గ్రామ వార్డు వాలంటీర్లతో సచివాలయాల వారీగా సమావేశాలు నిర్వహించబోతున్నారు.ఈ సమావేశాల్లో ఎవరెవరు ఏం చేయాలో ఈ సమావేశాల్లో నిర్దేశించనున్నారు.
సచివాలయ సమన్వయకర్తలు, గృహసారధులను వాలంటీర్లకు పరిచయం చేయడం, వాలంటీర్లు తమ పరిధిలోని ఇళ్ళలోని వారి వివరాలను వారికి తెలియజేయడం వంటివి ఈ సమావేశాల్లో జరగబోతున్నాయి.అలాగే ఏప్రిల్ 3న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పై జగన్ ( jagan )ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించబోతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 15 వేల గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని ఇంటింటికి తిరిగే విధంగా దీనికి రూపకల్పన చేశారు.‘ మా నమ్మకం నువ్వే జగన్ ‘ అని ఉన్న స్టిక్కర్లను ఇళ్లకు చిన్న సైజు స్టిక్కర్లను ,ఆయా ఇళ్లలోని వారు వాడే సెల్ ఫోన్ లకు అతికించనున్నారు .మార్చి 18 నుంచి ఈ స్టిక్కర్లు అతికించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని భావించినా.ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా వేశారు.
మార్చి 18 నుంచి పూర్తిస్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.







