కర్ణాటకలో ఎన్నికల కౌంట్ డౌన్( Karnataka Elections ) ప్రారంభమైంది .ఇప్పటికే పోటీ చేసే పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం స్టార్ట్ చేశాయి .
కాంగ్రెస్, జెడిఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థుల ప్రకటించడం మొదలుపెట్టాయి … పనిలో పనిగా మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది .అయితే తమాషా ఏమిటంటే అధికార పార్టీ బిజెపి ( BJP ) మాత్రం ఇప్పటివరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు.గత ప్రభుత్వ పనితీరుతో ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉంటుందని ఇప్పటికే అంచనాకొచ్చిన కేంద్ర నాయకత్వం ఆచితూచి అభ్యర్థుల పేర్లు ప్రకటించాలని నిర్ణయించుకుంది.మార్చి 31న జరగబోయే కీలక స్థాయి సమావేశంలో పూర్తిస్థాయి చర్చలు జరిపిన తర్వాత మాత్రమే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని ఆ పార్టీ స్పష్టం చేసింది.

ఏప్రిల్ 8న మొదటి విడత అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తామని పార్టీ ప్రకటించింది.సీనియర్ల కోటాలో లేదా సామాజిక వర్గం కోటాలో టికెట్లు కేటాయింపు జరగదని గెలుపు గుర్రాలని తేలిన తర్వాత మాత్రమే టికెట్లు ఇస్తామంటూ ఇప్పటికే నాయకులకు సమాచారం చేరవేశారట ….అభ్యర్థులను ప్రకటించే అంతిమ అధికారం నరేంద్ర మోడీ, అమిత్ షా లదేనని( Modi Amith Sha ) టిక్కెట్ దక్కలేదంటూ తోక జాడిస్తే మాత్రం దానికి తగిన మూల్యం చెల్లించాల్సిందే అంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.సిట్టింగులు అందరికీ టికెట్లు దొరుకుతాయని ఆయా అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నప్పటికీ వారి గెలుపు పై సర్వే ఫలితాలు ఆధారంగా మాత్రమే టికెట్లు లభ్యమవుతాయని కేంద్ర నాయకత్వం సూచనలు చేసింది.

ఏది ఏమైనా మరొకసారి కర్ణాటకలో అధికారంలోకి రావాలని బలంగా నిర్ణయించుకున్న బిజెపి అధినాయకత్వం ఏ చిన్న తప్పుకి అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్లేలా పావులు కదుపుతుంది.ఇటీవల మతపరమైన విశ్వాసాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు విమర్శలకు తావిచ్చేలా ఉన్నాయని.న్యూట్రల్ ఓటర్లలో పార్టీకి కొంత చెడ్డ పేరు తీసుకొచ్చేయని పార్టీ అధినాయకత్వానికి రిపోర్ట్లు వెళ్లిందట…… అందువల్ల సరైన దిద్దుబాటు చర్యలు తీసుకొని ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే స్థాయి నేతలకు మాత్రమే టికెట్లు ఇచ్చి మరొకసారి అధికంలోకి రావాలని భాజపా పార్టీ వ్యూహాలు పన్నుతుంది మరి ఈ ప్రయత్నంలో ఎంత మేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి
.






