కాంగ్రెస్ లో దూకుడుగా జగ్గారెడ్డి...ఇక ఐక్యత కష్టమేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు ప్రతి ఒక్క పార్టీకి ఇప్పటి నుండి ప్రతి ఒక్క రోజు చాలా కీలకం.

 Jaggareddy Aggressively In Congress ... Is Unity Difficult Anymore Telangana Pol-TeluguStop.com

ఎందుకంటే వచ్చే రెండున్నరేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో అంతేకాక ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా తయారుగా ఉండటం చాలా ముఖ్యం.అయితే ఇంత కీలక సమయంలో కూడా కాంగ్రెస్ లో కలహాల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు.

ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా కాంగ్రెస్ నేతల తీరు ఉన్న పరిస్థితి ఉంది.

ఇటీవల కాంగ్రెస్ నేతలు ఐక్య రాగం వినిపించినా ఆ తరువాత యధారాజా తథా ప్రజ అన్న రీతిలో పార్టీ బలపడటం అంశం పై కాకుండా ఎవరికి నచ్చని రీతిలో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ ఇంత కీలక సమయంలో బీజేపీ కంటే తరువాత స్థానంలో నిలుస్తూ వస్తున్న పరిస్థితి ఉంది.

అయితే జగ్గారెడ్డి మాత్రం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల గురించి వేచి చూడకుండా తనదైన శైలిలో తన స్వంత అభిప్రాయాలను ఏకంగా విలేఖరుల సమావేశంలో ప్రస్తావిస్తుండటంతో పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది.

అయితే ఇటు జగ్గారెడ్డి వ్యవహారం, కోమటి రెడ్డి మౌనంతో కాంగ్రెస్ పార్టీలో నుండి ఇక ఐక్యత నుండి ఆశించడం అనేది కాస్త కష్టమనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.ఇలాంటి పరిస్థితే భవిష్యత్తులో కొనసాగితే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ భారీ నష్టాన్ని చవి చూసే అవకాశం ఉందని పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ నడుం బిగించే సమయం ఆసన్నమైనదని కలిసికట్టుగా తీవ్ర స్థాయిలో పోరాడితేనే గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube