టీడీపీని ఎన్టీఆర్ కు అప్పజెప్పి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు వైరల్!

గత కొద్ది రోజులుగా ఏపీ పాలిటిక్స్ లో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్( NTR ) పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.

సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలు ఎక్కడ చూసినా వినిపిస్తున్నాయి.

మరి ముఖ్యంగా టిడిపి నేతలు ఎటువంటి సమావేశంలో నిర్వహించిన కూడా అక్కడ ఎన్టీఆర్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది.కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాకుండా వైసీపీ నేతలు కూడా టీడీపీని ఇరుకున పెట్టడం కోసం ఎక్కువగా ఎన్టీఆర్ పేరుని ఉపయోగిస్తోంది.

అలా దాదాపుగా ప్రతి వైసీపీ నేతకు జూనియర్ ఎన్టీఆర్ మీద ఎక్కడలేని ప్రేమ, అభిమానాన్ని ప్రదర్శించడం చాలా పరిపాటిగా మారిపోయింది.

తాజాగా ఈ జాబితాలో ఒక ప్రముఖ నిర్మాత కూడా చేరారు.ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు అనే సినిమా నిర్మించిన చెంగల వెంకట్రావు.( Chengala Venkatrao ) ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడిన నిర్మాతే ఆ వెంకట్రావు.

Advertisement

అయితే ప్రస్తుతం ఈయన గారికి ఉన్నట్లుండి జూనియర్ ఎన్టీఆర్ మీద విపరీతమైన అభిమానం పొంగి పొర్లుతోంది.తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ కు అప్పచెప్పి, జూనియర్ ఎన్టీఆర్ ను సీఎంగా ప్రకటించాలట.

అప్పుడే టీడీపీ పార్టీ( TDP ) బతికి బట్ట కడుతుందట.ఇదంతా టీడీపీపై ఉన్న అభిమానమో లేక జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమో అనుకుంటే, మీరు బురదలో కాలేసినట్లే.

ఈయన గారి జెండా, ఎజెండా ఏమిటో ఆ వీడియోలో స్పష్టంగా కనపడుతోంది.

వెనుక సీఎం వైఎస్ జగన్( CM Jagan ) ఫోటోను పెట్టుకుని, మెడలో వైసీపీ జెండా వేసుకుని జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీకి సీఎం చేయాలని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై విమర్శలు కూడా చేసారు.కుటుంబాల నడుమ చిచ్చు పెట్టడం, తద్వారా రాజకీయ లబ్ధిని చేకూర్చడం వైసీపీ( YCP ) అజెండాలలో ప్రముఖమైనది.గత సార్వత్రిక ఎన్నికల ముందు కూడా ఇదే సూత్రాన్ని వైసీపీ పాటించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసినవే.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

జగన్ తల్లిని చెల్లిని తరిమేసారని కోడై కూస్తుంటే, తన కుటుంబంలోని విషయాలను పక్కన పెట్టి, ప్రత్యర్థి కుటుంబాలలో చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి నీచ రాజకీయాలను ఇకనైనా విడనాడితే మంచిది.

Advertisement

ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ మీద నిజంగానే అంత ప్రేమ ఉంటే, వైసీపీలోకి ఆహ్వానించి సీఎం సీటును ఇవ్వవచ్చు కదా? ఇలా వైసీపీ అండ్ కో చేసే ప్రతి కామెంట్స్ కు మీడియా ముందుకు వచ్చి బదులు ఇవ్వలేనని, తన కట్టే కాలే వరకు టీడీపీతోనే అనుబంధం ఉంటుందని పలు మార్లు మీడియా ముఖంగా తెలిపారు.బహుశా ఇది వైసీపీ అండ్ కో కు ప్లస్ పాయింట్ గా మారింది.ప్రతిసారి ఏదొక నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ – టీడీపీని ఉద్దేశించి కామెంట్స్ చేయడం, ప్రతిసారి దానికి వివరణ ఇవ్వడం అనేది ఎంతటి వారికైనా కుదరదు.

ఇందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా మినహాయింపు కాదు.అలా అని మౌనం వహించడం కూడా ఇలాంటి వారికి ఊతమిచ్చినట్లే అవుతుంది.ఈ విషయంపై ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.మొత్తానికి నిర్మాత వెంకట్రావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు