'వైఎస్సార్ సంపూర్ణ పోషణ' కార్యక్రమం వాయిదా... కారణమేమిటంటే....?

ఈ రోజు ప్రారంభం కానున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణంతో సంతాప సూచికంగా సంపూర్ణ పోషణ పథకాన్ని ఫోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అండ్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ఈ రోజు (సెప్టెంబర్ 1) న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథక ప్రారంభాన్ని ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు.మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చనిపోవడంతో కేంద్ర ప్రభుత్వం సంతాప దినంగా నిర్ణయించింది.

ఈ మేర రాష్ట్ర ప్రభుత్వం కూడా సంతాప దినంగా ప్రకటిస్తూ ఈ రోజు అమలు చేస్తామన్న పథకాన్ని వాయిదా వేశారు.వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా గర్భిణులకు, బాలింతలకు, చిన్న పిల్లలకు పోషకాహారం అందించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.

చిన్న పిల్లల్లో పోషకాహార లోపం వల్ల రక్తహీనత, ఎదుగుదల లోపం, మాతా శిశు మరణాలు తదితర ఆరోగ్య సమస్యలను నిర్మూలించాలని ప్రభుత్వం భావించింది.ఈ పథకం అమలు చేయడానికి రూ.1,863.11 కోట్లను ఖర్చు చేయనుంది.ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించింది.

Advertisement

ఈ అంగన్ వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు 30,16,000 మంది నమోదై ఉన్నారు.ఈ పథక అమలుతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది.

రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.‘‘ సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభం కానున్న వైఎస్సార్ సంపూర్ణ ఆరోగ్య పథకాన్ని మాజీ రాష్ట్రపతి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ.

పథకాన్ని సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభించనున్నాం.’’ అంటూ పేర్కొన్నాడు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు