వైఎస్ వివేకా హత్య కేసులో మళ్లీ రంగంలోకి సీబీఐ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మళ్లీ సీబీఐ విచారణ చేపట్టింది.

దీనిలో భాగంగా పులివెందులలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఇనయతుల్లాను అధికారులు ప్రశ్నించారు.

ఇనయతుల్లా.వివేకానంద రెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా, ఇంటిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేశారు.2019లో వివేకా హత్య జరిగినప్పుడు ఇంట్లోకి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న మృతదేహం ఫొటోలు, వీడియోలను తొలుత తీసింది ఇనయతుల్లానే కావడం గమనార్హం.ఈయన మొబైల్ ద్వారానే ఫొటోలు ఇతరులకు షేర్ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ హత్య కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేకా కుమార్తె సునీతా రెడ్డి వేసిన పిటిషన్ పై మంగళ వారం విచారణ జరిపిన సుప్రీం.సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కేసులో పురోగతి సాధించడమే లక్ష్యంగా సీబీఐ బృందం మల్లీ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్10, మంగళవారం 2024

తాజా వార్తలు