ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై వైయస్ షర్మిల సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీలో మరో 40 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు.

 Ys Sharmila Serious Comments On Cm Jagan During Election Campaign, Ys Sharmila,-TeluguStop.com

నేటి నుంచి ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది.ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం జగన్ పై సీరియస్ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.“న్యాయ యాత్ర”( Nyaya Yatra ) పేరిట షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.తాజాగా వైయస్ షర్మిల( YS Sharmila ) సోషల్ మీడియాలో వైయస్ జగన్ పై సీరియస్ పోస్ట్ పెట్టారు.“ఏపీ ‘ న్యాయ యాత్ర ‘ లో బాగంగా బద్వేల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది.YSR గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు.


కాంగ్రెస్ తరుపున 10 ఎన్నికల్లో గెలిచారు.కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.ఎన్నో అద్భుతాలు చేశారు.ఆయన ఆశయం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను.రాష్ట్రం ఇవ్వాళ దీన స్థితిలో ఉంది.ముఖ్యమంత్రి జగన్( CM YS Jagan ) పాలనలో విభజన హామీలు ఒక్కటి కూడా సాదించుకోలేదు కానీ బీజేపీకి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.

కడప స్టీల్ ఫ్యాక్టరీని శంకుస్థాపనల ప్రాజెక్ట్ చేశారు.బీజేపీ( BJP ) దగ్గర జగన్ ఒక బానిసలా మారారు.

కాంగ్రెస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం అభివృద్ది.ఇదే కడప జిల్లా నా పుట్టినిల్లు.

ఇక్కడ జమ్మలమడుగు లోనే పుట్టా.ఇవ్వాళ మీ వైఎస్సార్ బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది.

మీ దీవెనలతో ఆశీర్వదించండి గెలిపించండి”.అంటూ పోస్ట్ పెట్టడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube