బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్( BRS Leader KCR ) పొలంబాట పేరిట కరీంనగర్ లో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government )పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శలు చేశారు.ఇవాళ కరీంనగర్ జిల్లా( Karimnagar )లో పర్యటించిన కేసీఆర్ పలు గ్రామాలలో ఎండిన పంట పొలాలను పరిశీలించారు.
రైతుల కష్టాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.అనంతరం కరీంనగర్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.భూధన్ పోచంపల్లిలో ఒకే రోజు ఏడుగురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు.50,000 పరిహారం ఇవ్వాలని ఆనాటి సీఎం చంద్రబాబుని కోరాను.
ఆ దుర్మార్గుడు మూర్ఖుడు పట్టించుకోలేదు.దీంతో నేను భిక్షాటన చేసి ₹7.50 లక్షలు ఆ కుటుంబాలకు అందజేసి ఆదుకోవడం జరిగింది.బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నో స్కీములు తీసుకొచ్చినట్లు కేసిఆర్ తెలియజేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) తీవ్రస్థాయిలో కేసీఆర్ మండిపడ్డారు.రాష్ట్రంలో రైతులు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు.200 మందికి పైగానే రైతులు మరణించడం జరిగింది.ఆ రైతుల ఉసురు పాపం కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది.మిమ్మల్ని వదిలిపెట్టమని చెబుతున్నా.పంట కోసం పెట్టుబడిపోయింది.వస్తాదనుకున్న పంట పోయింది.
తనని కలిసిన రైతులు( Farmers ) చాలా మంది ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతున్నారు.నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పాను.
ఖచ్చితంగా ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలి.పంటలు ఎండిన మాట వాస్తవం.
నష్టం జరిగింది వాస్తవం.రైతాంగం కన్నీరు మున్నీరు అవుతున్న మాట వాస్తవం.
అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పై కేసీఆర్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.