డబ్బు కంటే మనుషులకే విలువ ఇచ్చే ఇండస్ట్రీలోని ప్రముఖ సెలబ్రిటీలు వీళ్లే!

సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో చాలామంది సెలబ్రిటీలు డబ్బులకు ప్రాధాన్యత ఇస్తారు.ఎవరు ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తే ఆ బ్యానర్ లో మాత్రమే పని చేయడానికి కొంతమంది హీరోలు ప్రాధాన్యత ఇస్తారు.

 These Celebrities Gave Importance To People More Than Money Details Here,celebr-TeluguStop.com

అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఇండస్ట్రీలో డబ్బు కంటే మనుషులకే విలువ ఇస్తారు.అలా మనుషులకే విలువ ఇచ్చే సెలబ్రిటీల జాబితాలో చిరంజీవి( Chiranjeevi ) ముందువరసలో ఉంటారు.

చిరంజీవి వెల్లడించరు కానీ ప్రతిరోజూ ఆయన ఎన్నో గుప్త దానాలు చేస్తారు.సినిమా రంగానికి చెందిన వ్యక్తులైనా, ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తులైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మాత్రం ఆయన అస్సలు తట్టుకోలేరు.

చిరంజీవి నుంచి సహాయం పొందిన వాళ్ల జాబితా తీస్తే ఆ సంఖ్య వేలల్లో ఉంటుందని సమాచారం అందుతోంది.చిరంజీవి రీల్ లైఫ్ లో మాత్రమే కాదని రియల్ లైఫ్ లో కూడా మెగాస్టార్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Balakrishna, Chiranjeevi, Ram Charan, Gave Importance-Movie

మరో స్టార్ హీరో మహేష్ బాబు సైతం డబ్బు కంటే మనుషులకు ఎంతో వాల్యూ ఇస్తారు.తన సినిమా వల్ల ఎవరైనా నష్టపోతే మహేష్ బాబు ఆ నిర్మాతలను కచ్చితంగా ఆదుకుంటారు.ఉచితంగా ఎంతోమంది పిల్లలకు చికిత్స చేయించిన మహేష్ బాబు నిర్మాతలకు ఎల్లవేళలా సపోర్ట్ గా ఉంటారు.మరో స్టార్ హీరో చరణ్( Ram Charan ) సైతం డబ్బుకు ఎక్కువ విలువ ఇవ్వరని కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడానికి ప్రాధాన్యత ఇస్తారని భోగట్టా.

Telugu Balakrishna, Chiranjeevi, Ram Charan, Gave Importance-Movie

స్టార్ హీరో బాలయ్య( Hero Balakrishna ) సైతం ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే ఆదుకుంటారని ఒక్క మెసేజ్ పెడితే చాలు రియాక్ట్ అవుతారని తెలుస్తోంది.పారితోషికం విషయంలో సైతం ఎక్కువగా డిమాండ్ చేయరని తెలుస్తోంది.ఈ జాబితాలో స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.అవతలి వాళ్లు కష్టాల్లో ఉంటే కోట్ల రూపాయల సహాయం చేయడానికి సైతం ప్రభాస్ వెనుకాడరు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ), ఎన్టీఆర్ కూడా డబ్బు కంటే స్నేహానికి, మనుషులకు విలువ ఇస్తారని తమ వంతు సహాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటారని భోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube