టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో రక్ష( Actress Raksha ) ఒకరు కాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ నటి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.నేను చేసిన రోల్స్ విషయంలో నేనేం ఫీల్ కాలేదని ఆమె తెలిపారు.
ఇప్పుడు మాత్రం నేను ఫీల్ అవుతున్నానని ఆమె కామెంట్లు చేశారు.రవిబాబు గారు నాకు నచ్చావులే సినిమా( Nachavule )లో మంచి రోల్ ఇచ్చారని రక్ష పేర్కొన్నారు.
మదర్ క్యారెక్టరా నేనా అని చెప్పగా రవిబాబు ఒప్పించడంతో నేను అంగీకరించానని ఆ సినిమాకు నాకు నంది అవార్డ్ వచ్చిందని రక్ష అన్నారు.ఆ తర్వాత చాలా సినిమాలు చేశాను కానీ మరీ మంచి పాత్రలు లేదని ఆమె తెలిపారు.
ఇప్పుడు అందరు హీరోలకు నేను అమ్మ పాత్రలు( Mother Roles ) చేయొచ్చని కానీ ఒకప్పుడు నేను చేసిన సాంగ్స్ వల్ల ఆఫర్లు రావడం లేదని అనుకుంటున్నానని రక్ష పేర్కొన్నారు.నాది లవ్ మ్యారేజ్ అని నువ్వు వస్తావని సినిమా సమయంలో నా పెళ్లి జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.కూతురు డిగ్రీ పూర్తి చేసిందని రక్ష పేర్కొన్నారు.కూతురికి సినిమాలపై ఆసక్తి ఉందని ఏం జరుగుతుందో చూడాలని ఆమె అన్నారు.నచ్చావులే సినిమా తర్వాత హైదరాబాద్ కు షిఫ్ట్ అవ్వాలని అనుకుని షిఫ్ట్ అయ్యానని రక్ష తెలిపారు.సీరియల్స్ విషయంలో హ్యాపీ అని ఆమె పేర్కొన్నారు.
పాజిటివ్ రోల్స్ అంటే చాలా ఇష్టమని ఆమె పేర్కొన్నారు.
నేను కోపం వచ్చి చాలామందిని కొట్టానని రక్ష అన్నారు.నేను చేసిన పాత్రలను చూసి తప్పుగా బిహేవ్ చేస్తే కొడతానని ఆమె తెలిపారు.పెదరాయుడు( Pedharayudu ) తమిళ్ లో చేస్తున్న సమయంలో ఆ సినిమాలో టీచర్ రోల్ చేశానని రక్ష తెలిపారు.
ఒక డైరెక్టర్ మంచి రోల్ అని చెప్పి అలాంటి రోల్ ను నాకు ఆఫర్ చేశారని ఆ డైరెక్టర్ ఇబ్బంది పెడితే తట్టుకోలేక ఒక్కటి ఇచ్చానని ఆమె వెల్లడించారు.డబుల్ మీనింగ్ మాట్లాడితే నాకు నచ్చదని రక్ష పేర్కొన్నారు.