అగ్రరాజ్యం అమెరికాలో భూకంపం..!!

అగ్రరాజ్యం అమెరికా( America )లో భూకంపం సంభవించింది.న్యూ జెర్సీ, న్యూ యార్క్ నగరాల్లో భూప్రకంపనలు వచ్చాయి.న్యూ జెర్సీలో( New Jersey ) రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది.అమెరికా కాలమానం ప్రకారం ఉ.10.20 గంటలకు భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది.ఎక్కడ కూడా ఆస్తి నష్టం ప్రాణం నష్టం జరగలేదు.

 Earthquake In Superpower America, Japan, Earthquake, America,new Jersey-TeluguStop.com

అగరాజ్యం అమెరికాలో భూకంపాలు( Earthquakes ) చాలా అరుదు.గత ఏడాది జులై నెలలో అలస్క రీజియన్ లో రిక్టర్ స్కేలుపై  7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది.ఈ భూకంపం వల్ల దక్షిణా అలస్కాలో ఉన్న ద్వీప ప్రాంతంలో సునామీ( Tsunami ) హెచ్చరికలు అధికారులు జారీ చేశారు.

ప్రపంచంలో ఇటీవల భూకంపాలు భారీ ఎత్తున సంభవిస్తున్నాయి.మరి ముఖ్యంగా జపాన్ దేశంలో భూకంపాలు కామన్.ఇటీవల కాలంలో వరుసగా భూకంపాలతో జపాన్ దేశం( Japan ) భయాందోళనలకు గురవుతోంది.ఇటీవల తైవాన్ దేశం కేంద్రంగా వచ్చిన భూకంపంతో జపాన్ లో సునామీ వార్నింగ్స్ వచ్చాయి.దాదాపు 6.1 తీవ్రతతో భూకంపం రావడం జరిగింది.భూకంప దాటికి భారీ భవనాలు ఊగిపోయాయి.గత మార్చి నెలలో ఎస్.ఎస్ రాజమౌళి ఆయన తనయుడు కార్తికేయ జపాన్ దేశంలో పర్యటించారు.ఆ సమయంలో కూడా భూకంపం సంభవించటం జరిగింది.

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున భూకంపాలు సంభవిస్తూ ఉన్నాయి.ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాలో భూకంపం సంభవించడం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube