ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో మరో 70 రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఏడాది ప్రారంభంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది.
అనంతరం జనవరి 21వ తారీకు నాడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించాక వైఎస్ షర్మిల( YS Sharmila ) ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో 2024 ఎన్నికలకు అందరూ రెడీగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.ఇక ఇదే సమయంలో వైసీపీ( ycp ) ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.
వైసీపీ పార్టీకి చెందిన కీలక నాయకులపై బహిరంగ సభలలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.తాజాగా ఈ రకంగానే ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి( Vijayasai Reddy ) పై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.విశాఖపట్నం పారిశ్రామిక సదస్సు నుంచి ఎన్ని కోట్లు పెట్టుబడులు వచ్చాయని ప్రశ్నించారు.13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులపై ప్రభుత్వం ప్రోగ్రెస్ కార్డుతో రాగలదా.? అలాగే మీ హయాంలో పోయిన పెట్టుబడులు గురించి చెప్పండి అని నిలదీశారు.అదేవిధంగా ఈ ఏడాది దావోస్ వెళ్లొద్దని ప్రభుత్వం ఎందుకు నిర్ణయించుకుంది అంటూ వైఎస్ షర్మిల ట్విట్టర్ లో విజయసాయి రెడ్డికి ప్రశ్నలు సంధించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy