వావ్‌ జగన్‌ : బాబు కోట్లు ఖర్చు చేస్తే జగన్‌ 2 లక్షలు

ఏపీ సీఎంగా వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్దం అయ్యాడు.

మొదట తిరుపతిలో ప్రమాణ స్వీకారం చేయాలని భావించినా కూడా చివరకు విజయవాడలోని మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఈ ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రమాణ స్వీకారం చాలా నిరాడంబరంగా జరుపుకోవాలని జగన్‌ భావిస్తున్నాడు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొదటి సీఎంగా ఎన్నిక అయిన తర్వాత చంద్రబాబు నాయుడు భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం చేశాడు.

అప్పట్లోనే దాదాపు 5 కోట్లు ఖర్చు చేసి పెద్ద ఎత్తున అతిథులను ఆహ్వానించి రాష్ట్రం గురించి దేశ వ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం జరిగింది.ఇప్పుడు జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రం కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే తన ప్రమాణ స్వీకారంకు ఖర్చు చేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

సీఎస్‌ కనీసం అయిదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని జగన్‌కు చెప్పిన సమయంలో మరీ ఎక్కువ ఖర్చు వద్దు రెండు లక్షలతో చాలు అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది.

Advertisement
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

తాజా వార్తలు