ఆ రెండు చోట్లా జ‌గ‌న్ పార్టీ స‌ర్క‌స్ ఫీట్లు... నేత‌ల పాట్లు ?

ఏపీలో పెద్ద జిల్లా అయిన తూర్పుగోదావ‌రి జిల్లాలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ, రూరల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార వైఎస్సార్‌సీపీ స‌ర్క‌స్ ఫీట్లు చేస్తోంది.

పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉండి.

కావాల్సినంత బ‌లగం ఉండి కూడా నేత‌లు ప‌ట్టుదొర‌క్క ఇబ్బందులు ప‌డుతున్నారు.సిటీలో ఎన్నిక‌ల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య‌ప్ర‌కాశ్ రావును త‌ప్పించి.

ఏపీఐఐసీ మాజీ చైర్మ‌న్ శివ‌రామ‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు పార్టీ ప‌గ్గాలు ఇచ్చారు.ఇక రూర‌ల్లో వ‌రుస‌గా రెండు సార్లు ఓడిపోతోన్న ఆకుల వీర్రాజును ఇన్‌చార్జ్‌గా కొన‌సాగించారు.

అయితే వీరిద్ద‌రు రాజాన‌గ‌రం ఎమ్మెల్యే, కాపు కార్పొరేష‌న్ చైర్మ‌న్ జ‌క్కంపూడి రాజా వ‌ర్గంగా ఉండ‌డంతో ఎంపీ భ‌ర‌త్ చాలా తెలివిగా వీరికి చెక్ పెట్టించేసి వీరిని త‌ప్పించేసి త‌న వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు నేత‌ల‌కు సిటీ, రూర‌ల్ ఇన్‌చార్జ్ ప‌గ్గాలు ఇప్పించుకున్నారు.ఇన్ని సార్లు పార్టీ ఇన్‌చార్జ్‌ల‌ను మార్చినా ఇక్క‌డ వైసీపీకి ఎంత వ‌ర‌కు ప‌ట్టు దొరుకుతుంది ? అన్న‌ది చెప్ప‌లేం అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆదిరెడ్డి భ‌వానీ ఫ్యామిలీకి మంచి ప‌ట్టు ఉంది.గ‌త ఎన్నిక‌ల్లోనే ఆమె ఏకంగా 30 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు.

Advertisement

ఇప్పుడు కూడా ఆ ఫ్యామిలీకి అక్క‌డ ప‌ట్టు స‌డ‌ల్లేదు.ఇక రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి సిట్టింగ్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గట్టి పట్టున్న నేత.టిడిపి ఆవిర్భావం నుంచి ఉన్న ఆయన రూరల్ లోనే కాదు అర్బన్ లోను చక్రం తిప్పగల సత్తా ఉన్న నాయకుడు.

ఈ వ‌య‌స్సులోనూ ఆయ‌న వాయిస్ పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు.ఇటీవ‌ల చంద్ర‌బాబు ఆయ‌న‌కు పోలిట్ బ్యూరో ప‌ద‌వి కూడా ఇవ్వ‌డంతో దూసుకు పోతున్నారు.ఆదిరెడ్డి, బుచ్చ‌య్య లాంటి బ‌ల‌మైన వ‌ర్గాలున్న నేత‌ల‌తో ఈ కొత్త ఇన్‌చార్జ్‌లు ఎంత వ‌ర‌కు ఢీ కొడ‌తారో ?  చూడాలి.ఏదేమైనా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఇర‌వై నెల‌లు అవుతున్నా.

కొత్త నేత‌ల‌ను మార్చుతున్నా ప‌ట్టుదొర‌క‌ని ప‌రిస్థితి.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు