కారు ఎక్కిన విజయసాయి రెడ్డి, క్షణాల్లో దించేసిన జగన్

గురువారం తెల్లవారు జామున ఏపీ లోని విశాఖ లో చోటుచేసుకున్న గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.

అందరూ నిద్ర లో ఉన్న సమయంలో ఒక్కసారిగా విశాఖ లోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీక్ అవడంతో స్థానిక ప్రజలు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.

ప్రమాదకరమైన విషవాయువులు విడుదల కావడం తో దాదాపు 10 మంది మృత్యువాత పడగా పలువురు ఆసుపత్రిలో ప్రాణాల తో కొట్టుమిట్టాడుతున్నారు.తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన ఈ ఘటన తో ఏపీ సీఎం జగన్ స్వయంగా పరిస్థితి పర్యవేక్షించేందుకు అమరావతి నుంచి విశాఖకు వెళ్లిన విషయం తెలిసిందే.

అక్కడ పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించిన ఆయన ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించడమే కాకుండా కుటుంబంలో వారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు.అయితే జగన్ విశాఖ బయలుదేరేముందు ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటన కు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.అసలు ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.

Advertisement

విశాఖలో చోటుచేసుకున్న దుర్ఘటన తో సీఎం జగన్ స్వయంగా అక్కడి పరిస్థితిని పర్యవేక్షించాలి అని తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి బయలుదేరారు.అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా ముఖ్యమంత్రి కారులో ఎక్కి కూర్చున్నారు.

అయితే అక్కడే ఉన్న ఏపీ ఆరోగ్య మంత్రి తో మాట్లాడుతున్న జగన్ ఉన్నట్టుండి విజయసాయిరెడ్డి కారులో ఎక్కి కూర్చున్న కొద్ది క్షణాల్లోనే కిందికి దిగాల్సిందిగా సీఎం జగన్ సూచించారు.దీంతో చేసేదేమీ లేక విజయసాయిరెడ్డి కారు నుంచి కిందికి దిగారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే విజయసాయిరెడ్డిని కారు నుంచి దింపేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.

అక్కడే ఉన్న ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానిని కారులో తన వెంట తీసుకెళ్లారు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
జేసీ పరేషాన్ : కూటమి పార్టీలకు మరో తలనొప్పి 

అయితే ఏది ఏమైనా కారులో ఎక్కికూర్చున్న విజయ సాయి రెడ్డి ని కిందకు దించేసి ఆళ్ల నాని కి ఎందుకు ఎక్కించుకున్నారో అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై సమీక్ష నిర్వహించాలన్నా, బాధితులకు సరైన వైద్య సాయం అందాలన్నా ఆరోగ్యశాఖ మంత్రి ముఖ్యం కాబట్టి ఆయనను సీఎం జగన్ తన వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు