జగన్ ఇలా చెప్తే నమ్మేస్తారా ...?

వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు మరింత చురుగ్గా మునుకు వెళ్తున్నాడు.తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ.

సభలు.సమావేశాలతో రాజకీయం వేడెక్కిస్తున్నాడు.ప్రతి సభలోనే.

తెలుగుదేశం ప్రభుత్వం పై విరుచుకుపడుతూ.కొత్త కొత్త హామీలు ఇస్తూ.

ప్రజల్లో పరపతి పెంచుకునే పనిలో పడ్డాడు.జగన్ విమర్శల్లో ఎక్కువగా కనిపించింది ఏంటంటే.

Advertisement

ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విమర్శలు చేయడమే ! చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నవి నమ్మొద్దు నమ్మొద్దు అంటూ పదేపదే ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు.ఈ సందర్భంగా తాను మాత్రమే విలువలకు.

విశ్వసనీయతకు మారుపేరు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రధానంగా.సమర శంఖారావం సభల్లో జగన్ చేస్తున్న ఆరోపణలను ఒక్కసారి పరిశీలిస్తే.ఓటర్ల జాబితాలో తమ పార్టీవారి పేర్లను తొలగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనీ, అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్ అన్నారు.చంద్రబాబు నాయుడు ఇచ్చే డబ్బు కోసం మోసపోవద్దనీ, అన్న వస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, రాగానే ప్రతీ సంవత్సరానికి రూ.15 వేలు ఇస్తారని ప్రతీ అమ్మకీ చెల్లికీ చెప్పాలంటూ పార్టీ నాయకులను కోరారు.చంద్రబాబు ఇచ్చే ఈ సొమ్ము చూసి మోసపోవద్దనీ.అన్న ముఖ్యమంత్రి కాగానే మే నెల వచ్చేసరికి ప్రతీ రైతన్న చేతిలో రూ.12,500 పెట్టబోతున్నాడని చెప్పమని కోరారు.ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న సొమ్ము నమ్మొద్దనీ, అన్న ముఖ్యమంత్రి కాగానే 45 ఏళ్లు నిండిన ప్రతీ అక్కకూ ఇంటికొచ్చి రూ.75 వేలు ఇస్తానని చెప్పాలన్నారు!

అమ్మా.చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలు నమ్మొద్దమ్మా.అన్న వస్తున్నాడూ ముఖ్యమంత్రి అవుతున్నాడు, రాగానే పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాడు అని చెప్పమన్నారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

అన్న ముఖ్యమంత్రి అవుతాడు, డబ్బులు ఇస్తాడు, చంద్రబాబు ఇస్తున్న డబ్బులు నమ్మొద్దు.ఈ మూడు అంశాలనే ఫోకస్ చేసుకుని జగన్ ప్రసంగాలు ఉంటున్నాయి.ప్రస్తుతం టీడీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చొచ్చుకువెళ్లిపోయాయి.

Advertisement

కొత్తగా అమలు చేస్తున్న వృద్ధాప్య పెన్షన్, డ్వాక్రా , ఇవన్నీ టీడీపీకి మైలేజ్ తీసుకొస్తున్నవే.నిజంగా ఇవన్నీ కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నావే.

కాకపోతే జగన్ కోణంలో మాత్రం ఇవన్నీ పెద్దగా ఉపయోగకరంగా లేని అంశాలుగానే ఉన్నాయి.ఈ కొత్త పథకాల అమలు వల్ల టీడీపీకి అమాంతం మైలేజ్ పెరగడం కూడా జగన్ తట్టుకోలేకపోతున్నాడు అనేది స్పష్టంగా కనిపిస్తోంది.

తాజా వార్తలు