ఈరోజు ఉదయం గుండె పోటుతో హఠాన్మరణానికి గురైన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి కొద్దిసేపటి క్రితం సీఎం శ్రీ వైయస్.జగన్, శ్రీమతి భారతి దంపతులు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని మంత్రి నివాసంలో నివాళులర్పించరు.
ఈ క్రమంలో గౌతమ్ రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి, తల్లిని… భార్య పిల్లలను సీఎం వైయస్ జగన్ ఓదార్చారు.
అనంతరం మిగతా కుటుంబ సభ్యులను సీఎం దంపతులు పరామర్శించారు.
ముఖ్య మంత్రి వైయస్ జగన్ తో పాటు వైసీపీ పార్టీకి చెందిన కీలక నాయకులు గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.మేకపాటి గౌతమ్ రెడ్డి మరణం కారణంగా ఏపీ ప్రభుత్వం రెండు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది.
ఎల్లుండా నెల్లూరు జిల్లా స్వగ్రామం బ్రాహ్మణపల్లి లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించ నున్నారు.మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి అమెరికా లో ఉండటంతో .అతని రాక కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.