అవిశ్వాసం వెనకాల మాస్టర్ ప్లాన్ వేసిన జగన్

రాజకీయాలలో ఒకరు ఎత్తు వేసే లోగా మరొకరు పై ఎత్తు వేస్తేనే అందులో మజా.

ఊరికినే కూర్చుంటే దెబ్బలు కొట్టి మన అధికారం దోచుకుని వెళ్ళిపోతూ ఉంటారు.

ఎప్పటికప్పుడు కొత్త స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళడమే ఎవరైనా చెయ్యాల్సింది.ప్రస్తుతం వైకాపా పార్టీ కి చుక్కలు చూపిస్తున్న చంద్రబాబు జగన్ పెడతాను అన్న అవిశ్వాస తీర్మానం విషయంలో ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

బడ్జెట్‌ సమావేశాల్లో ఇటు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం, అటు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం.రెండూ అసెంబ్లీ సమావేశాల్ని హీటెక్కించనుండడం ఖాయమే.

అధికార పార్టీ కి అవిశ్వాస తీర్మానం తో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఎదురవ్వవు అని చెప్పాల్సి ఉంది.అధికార పార్టీ కి భారీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది.

Advertisement

కానీ అవిశ్వాసం వెనకాల వైకాపా వారి వ్యూహం పెద్దగా ఉన్నట్టు తెలుస్తోంది.ఇపటికే ఎనిమిది మంది పైగా ఎమ్మెల్యే లు టీడీపీ లోకి వెళ్ళిపోయారు.

మరో ముగ్గురినో నలుగురినో రానున్న రోజుల్లో టీడీపీలో చేర్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్కెచ్‌ ప్రిపేర్‌ చేశారు.మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం నాటికి టీడీపీలో చేరతారన్నది టీడీపీ నేతల అంచనా.

ఆ లెక్క అంత వుండకపోవచ్చుగానీ, డబుల్‌ డిజిట్‌ని టచ్‌ చేయవచ్చన్న ఊహాగానాలైనే విన్పిస్తున్నాయి.

పది మంది ఎమ్మెల్యే లు ఒక పార్టీ ని వీడి మరొక పార్టీ లోకి వెళ్ళడం అంటే చిన్న విషయం కాదు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
ఎమ్మెల్యే కురసాల కన్నబాబుపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జగన్ అవిశ్వాస భయం పెట్టకపోతే ఈ పాటికి 15 మంది వరకూ టీడీపీ లాక్కునేది అని తెలుస్తోంది.అవిశ్వాస తీర్మానం అంటే, ఎలాగూ విప్‌ జారీ చేసే అవకాశం అన్ని పార్టీలకూ వుంటుంది.

Advertisement

విప్‌ని ఆధారం చేసుకుని, విప్‌ని ధిక్కరించే ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు డిమాండ్‌ చేయాలన్నది వైఎస్సార్సీపీ వ్యూహం.అనైతికంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు, విప్‌ - అనర్హత విషయంలో మాత్రం చేతులెత్తేయక తప్పదు.

సో, చంద్రబాబు ఈ బడ్జెట్‌ సమావేశాల్లో అవిశ్వాసం అన్న అంశమే చర్చకు రాకుండా జాగ్రత్త పడాల్సి వుంటుంది.దానికి తగ్గట్టే చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేశారట కూడా.

ఎలాంటి పరిస్థతి లో పార్టీ మారిన ఎమ్మెల్యే ల పైన అనర్హత వేటు పడకూడదు అనేది జగన్ ఆలోచన.

తాజా వార్తలు