న్యాయమూర్తులపై పోరాటం...జగన్ వ్యూహం క్లియర్‌గా ఉందా..?

జగన్ అధికారంలోకి వచ్చాక కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అనేకసార్లు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీం కోర్టుల నుంచి తీర్పులు వచ్చాయి.

ఈ క్రమంలోనే కొందరు జడ్జీలని టీడీపీ అధినేత ప్రభావితం చేస్తున్నారని వైసీపీ శ్రేణులు, నాయకులు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.ఏకంగా న్యాయస్థానాలు, న్యాయమూర్తులపైనే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్ ఏకంగా సుప్రీం కోర్టు ఎన్వీ రమణపై సుప్రీం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు ఫిర్యాదు చేశారు.రమణ హైకోర్టు జడ్జీలని ప్రభావితం చేస్తున్నారని లేఖ రాశారు.

ఈ లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

అయితే ఇదే విషయంపై ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి జగన్ వ్యూహం ఏంటి అనే దానిపై ఓ విశ్లేషణ చేశారు.దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులపై ఉన్న కేసులు త్వరగా తేలాలని రమణ ఇటీవల తీర్పు ఇచ్చారు.

దీంతో జగన్ కేసులు విచారణ వేగవంతం అయ్యాయి.

పైగా రమణ నెక్స్ట్ కాబోయే సి‌జే‌ఐ అని, అందుకే ఆయన్ని టార్గెట్ చేశారని చెబుతున్నారు. రమణ సి‌జే‌ఐ అయితే ఇంకా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే జగన్ ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారని చెబుతున్నారు.ఇక ఇవేమీ వర్కౌట్ కాకుండా, ఒకవేళ జగన్‌పై కేసులు విచారణ పూర్తయ్యి, ఆయన గనుక జైలుకు వెళితే, అప్పుడు కూడా ఓ వ్యూహం ప్రకారం ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారని అంటున్నారు.

అది ఏంటంటే ఒకవేళ జగన్ జైలుకు వెళితే, పైన రమణ ప్రభావం వల్లే జైలు పాలయ్యామనే సింపతీ క్రియేట్ చేయడానికి చూస్తారని చెబుతున్నారు.అందుకే ముందు వ్యూహం ప్రకారమే.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

జగన్ దురుద్దేశ పూర్వకంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నారు.పైగా న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసే విషయంలో మీడియాకు లేఖ విడుదల చేయడం సరైన విధానం కాదని, రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవారు ఇలా రాజకీయం చేయడం సమాజానికే చేటు అనే వాదనలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు