పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎంపీ స్థానం( Narsaraopet YCP MP ) పంచాయతీకి ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ తెర దించారని తెలుస్తోంది.ఈ మేరకు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్( MLA Anil Kumar Yadav ) పేరు ఖరారు అయిందని సమాచారం.
నిన్న సీఎం జగన్ ను ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కలిసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చిందని తెలుస్తోంది.
అయితే నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరుకు పంపాలని పార్టీ అధిష్టానం భావించింది.
అయితే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు( Srikrishnadevarayulu ) పార్టీతో పాటు పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.ముందు నుంచి నరసరావుపేట స్థానం నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించాలని యోచనలో ఉన్న సీఎం జగన్ .ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను ఖరారు చేశారని తెలుస్తోంది.అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.