నరసరావుపేట పంచాయతీకి తెర దించిన సీఎం జగన్..!!
TeluguStop.com
పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీ ఎంపీ స్థానం( Narsaraopet YCP MP ) పంచాయతీకి ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ తెర దించారని తెలుస్తోంది.
ఈ మేరకు నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్( MLA Anil Kumar Yadav ) పేరు ఖరారు అయిందని సమాచారం.
నిన్న సీఎం జగన్ ను ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కలిసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం అవకాశం ఇచ్చిందని తెలుస్తోంది.అయితే నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరుకు పంపాలని పార్టీ అధిష్టానం భావించింది.
"""/"/అయితే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీకృష్ణదేవరాయలు( Srikrishnadevarayulu ) పార్టీతో పాటు పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
ముందు నుంచి నరసరావుపేట స్థానం నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించాలని యోచనలో ఉన్న సీఎం జగన్ .
ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను ఖరారు చేశారని తెలుస్తోంది.అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.
మహేష్ జక్కన్న మూవీ ముహూర్తం ఫిక్స్.. ఆరోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే!