ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ( YS Rajasekhar Reddy ) జీవిత కథ ఆధారంగా 2019 వ సంవత్సరంలో డైరెక్టర్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం యాత్ర ( Yatra )ఈ సినిమా 2019 ఎన్నికల ముందు విడుదల కావడంతో ఈ సినిమా ప్రభావం జగన్ పార్టీకి చాలా ఉపయోగపడిందని చెప్పాలి.అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా యాత్ర 2( Yatra 2 ) వచ్చే ఏడాది ఎన్నికల ముందు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

నేడు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కావడంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు.ఈ సీక్వెల్ చిత్రంలో జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) పాదయాత్ర ఆయన పొలిటికల్ కెరియర్ గురించి ఉండబోతుందని తెలుస్తోంది.తాజాగా విడుదల చేసినటువంటి ఈ మోషన్ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా మారింది.
ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాయిస్ తో మోషన్ పోస్టర్ మొదలవుతుంది.నమస్తే బాబు, నమస్తే చెల్లమ్మా, నమస్తే అంటూ వైఎస్ఆర్ వాయిస్ తో భారీ చేతి స్టాట్యూని చూపిస్తుంటారు.

ఆ తరువాత ఈ స్టాట్యూపైకి జగన్ వెళతారు.నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.
నేను విన్నాను… నేనున్నాను అంటూ జగన్ పాత్రధారి చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక ఈ మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ మాట్లాడుతూ తన గురించి ఎన్ని విమర్శలు వచ్చినా తాను పట్టించుకోనని తెలిపారు.ఎన్నికల ముందే ఈ సినిమా ఎందుకు విడుదల చేస్తున్నారనీ చాలామంది ప్రశ్నలు వేస్తున్నారని అయితే అందరికీ తాను సమాధానం చెప్పదలుచుకోలేదని తెలిపారు.
ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారన్న విషయాన్ని మాత్రం త్వరలోనే ప్రకటించబోతున్నామని ఈ సందర్భంగా డైరెక్టర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







