బుల్లితెర యాంకర్ అనసూయ( Anasuya ) ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే అనసూయ తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్లలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె చేసిన పోస్ట్ కనుక చూస్తుంటే అనసూయ వీకెండ్ మూడ్ లో బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది.ఇక తన డే ఎలా ప్రారంభమైందో చెబుతూ ఈమె చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఉదయాన్నే ఈమె హెల్తీ బ్రేక్ ఫాస్ట్ చేశారని తనకు నిద్ర అంటే చాలా ఇష్టమని తెలిపారు.
ప్రతిరోజు రాత్రి తాను నిద్రపోయేది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం కోసమే అంటూ అనసూయ ఎర్లీ మార్నింగ్ లుక్ కిసంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విమానం ( Vimaanam ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ ప్రస్తుతం ఇతర సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈమె అల్లు అర్జున్( Allu Arjun ) రష్మిక( Rashmika ) మందన్న హీరో హీరోయిన్లుగా సుకుమార్( Sukumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో ఈమె దాక్షాయిని పాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమా సీక్వెల్ చిత్రంలో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.







