టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ( Nandamuri Family ) గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ ఫ్యామిలీ నుండి పరిచయమైన ప్రతి ఒక్క హీరో స్టార్ పొజిషన్ లో దూసుకుపోతున్నారు.
సీనియర్ ఎన్టీఆర్ సపోర్టుతో అడుగుపెట్టి.దానికి తోడు తమ టాలెంట్ జత చేసి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగి మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు.
అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా అందర్నీ ఫిదా చేశారు.ఇతరులను నొప్పించకుండా మాట్లాడటం వీరి ప్రత్యేకత.
అందరితో చాలా సరదాగా కనిపిస్తూ ఉంటారు.మనకు తెలిసిన వరకైతే తారక్, బాలయ్యలు( Tarak , Balayya ) కూడా ఇతరులను నొప్పించకుండా బాగా సరదాగా మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటారు.
ఇక వీళ్ళు బయటే కాదు ఇంట్లో కూడా సరదాగా గడుపుతుంటారు.

కష్టమొచ్చిన సంతోషం వచ్చిన అందరూ పంచుకుంటారు.అందుకే ఈ ఫ్యామిలీకి టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో మంచి గౌరవం ఉంది.ముఖ్యంగా అన్న తమ్ముళ్లు ఎంతలా కలిసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బాలయ్య తన అన్నలతో చాలా ఫ్రీగా ఉండేవాడు.ఇక వీళ్ళని చూసి వీళ్ళ పిల్లలు కూడా అందర్నీ కలుపుకుంటూ పోతుంటారు.
ముఖ్యంగా అన్నదమ్ములైన తారక్, కళ్యాణ్ రామ్ ( Tarak, Kalyan Ram )ఎంతలా కలిసి ఉంటారో చూస్తూనే ఉంటాం.ఏదైనా ఈవెంట్ లో, ఇంటర్వ్యూలలో, ఫ్యామిలీ ఫంక్షన్లలో కనిపించినప్పుడు ఇద్దరు ఒకే చోట ఉంటారు.
ఒకరిని వదిలి మరొకరు ఉండలేరు.అసలు వీరి మధ్య ప్రేమ చూస్తే ఇతరులే ఈర్ష పడాలి అన్నట్లుగా ఉంటుంది.
ఇద్దరు ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు కూడా ఒకరి గురించి ఒకరు బాగా చెప్పుకుంటూ ఉంటారు.

ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమలను చూపించుకుంటూ ఉంటారు.కేవలం వ్యక్తిగత విషయాలలోనే కాకుండా సినిమా విషయంలో కూడా ఇద్దరు ఒకరికి ఒకరు సలహాలు తీసుకుంటారని తెలిసింది.ఒకరి సినిమా ఈవెంట్ కి మరొకరి తప్పకుండా వస్తుంటారు.
అలా ప్రతి విషయంలో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు.ఇక ఎన్టీఆర్ కంటే కళ్యాణ్ రామ్ పెద్దవాడు.
తన అన్నకు ఎంత గౌరవం ఇస్తాడు కళ్యాణ్ రామ్ కూడా తన తమ్ముడికి అంత గౌరవం ఇస్తాడు.అయితే ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ ను అన్న అని పిలిస్తే కళ్యాణ్ రామ్ మాత్రం తన తమ్ముడిని తమ్ముడు అని కాకుండా, పేరు పెట్టి పిలవకుండా మరోలా పిలుస్తాడని తెలిసింది.
ఈ విషయాన్ని ఆయనే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు తెలిపాడు.తను ఎన్టీఆర్ ని నాన్న( nanna ) అని పిలుస్తానని.
ఏ రోజు కూడా తమ్ముడు అనే ఉద్దేశంతో చూడలేదని.నాన్న అంటే నాకు ఇష్టం కాబట్టి నాన్నని తనలో చూసుకుంటాను అని.ఒక నాన్న అనియే కాకుండా ఒక బిడ్డ లాగా కూడా, తండ్రి లాగా చూసుకుంటానని తెలిపాడు.స్టేజి మీద కూడా తనను నాన్న అని పిలుస్తాను అని అన్నాడు.
ఇక కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.







