మీకు తెలుసా? మొబైల్ నంబర్‌ లాగా క్రెడిట్‌ కార్డ్‌ను కూడా పోర్ట్ చేయొచ్చని?

వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజమే.దేశీయంగా బ్యాంకింగ్ సర్వీసులు విపరీతంగా పెరగడంతో, క్రెడిట్ కార్డుల పరిధి యూజర్ల నంబర్ చాలా వేగంగా పెరుగుతోందని చెప్పుకోవచ్చు.

 Do You Know Can I Port Credit Card Like Mobile Number? Do You Know, Latest News,-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా.క్రెడిట్ కార్డ్( Credit card ) వినియోగం విషయంలో, కొత్త మార్పు తీసుకొచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ సిద్ధమైంది.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ మనకు కొత్త కాదు.ప్రస్తుత సర్వీస్ ప్రొవైడర్ వలన మనకు సంతృప్తి లేకుంటే MNP ద్వారా ఈజీగా వేరే సర్వీస్ ప్రొవైడర్ కి మారవచ్చు.

క్రెడిట్ కార్డుల విషయంలోనూ సరిగ్గా ఇలాంటిదే చేయాలనుకుంటోంది రిజర్వ్ బ్యాంక్.దీనికి ‘క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ పోర్టబిలిటీ‘ అనే పేరు పెట్టడం గమనార్హం.

Telugu Port, Credit, Latest, Number, Technolgy-Latest News - Telugu

ఇకపోతే ఇప్పటివరకు, కస్టమర్ కి ఏ నెట్వర్క్ కార్డ్ ఇష్యూ చేయాలో బ్యాంకులే నిర్ణయిస్తూ వస్తున్నాయి.ఇపుడు తాజాగా తమకు ఇష్టమైన క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ ని ఎంచుకునే ఆప్షన్ కస్టమర్లకే ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ యోచిస్తోంది.ఇందుకోసం ఒక డ్రాఫ్ట్ సర్క్యులర్ ని విడుదల చేసింది.ఈ రూల్ ప్రకారం ఇకపై, కొత్త కార్డ్ జారీ చేసే సమయంలో, కస్టమర్కు ఏ నెట్వర్క్ కావాలో బ్యాంకులు అడగాల్సి ఉంటుంది.

అయితే, ప్రతి క్రెడిట్ కార్డ్కు ఒక వాలిడిటీ ఉంటుంది.మీ కార్డ్ వాలిడిటీ పూర్తయితే, బ్యాంక్లు కొత్త డేట్తో మరో కార్డ్ ఇష్యూ చేస్తాయి.ఇలా, కార్డ్ రెన్యూవల్ సమయంలో నెట్వర్క్ మార్చుకునే అవకాశం ఎగ్జిస్టింగ్ కార్డ్స్ విషయంలో ఉంటుందన్నమాట.

Telugu Port, Credit, Latest, Number, Technolgy-Latest News - Telugu

ఇక ఈ ‘క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ పోర్టబిలిటీ( Credit Card Portability )’ అనేది అమల్లోకి వస్తే కస్టమర్లు ఎక్కువ లాభాలు పొందుతారు అనేది నిపుణుల ఆమాట.

వివిధ నెట్వర్క్స్ తమ కార్డ్స్ మీద విభిన్న ఫీచర్స్ అందిస్తుంటాయి.కొన్ని కార్డులకు తక్కువ ఫీజు ఉండొచ్చు, మరికొన్నింటికి ఎక్కువ రివార్డ్ లభించొచ్చు.

దానిని పరిగణనలోకి తీసుకొని నెట్వర్క్ ని మార్చుకునే ఆప్షన్ అందుబాటులోకి వస్తే, వినియోగదార్లు తమ అవసరాలకు అనుగుణంగా నెట్వర్క్ ఎంచుకోవచ్చు.దేశీయ నెట్వర్క్ రూపే, ‘క్రెడిట్ కార్డ్ నెట్వర్క్ పోర్టబిలిటీ’ నుంచి భారీ ప్రయోజనం పొందవచ్చు.

రిజర్వ్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్స్ కోసం UPI ఫీచర్ తీసుకొచ్చింది.అయితే, రూపే నెట్వర్క్ కార్డ్ యూజర్లు మాత్రమే ఈ ఫెసిలిటీని ఉపయోగించగలరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube