ఆ హీరోకి భజన చేస్తాడనే నాగార్జున పై బాలయ్య బాబు పగ పెంచుకున్నాడా..?

తెలుగు చలన చిత్ర పరిశ్రమకి నటన నేర్పిన మహానుభావులు ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్.ఎలాంటి ఆదర్శం లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి, నటన అంటే ఇలా ఉంటుంది అని తన తర్వాతి తరం హీరోలు వీరిని చూసి నేర్చుకునే రేంజ్ లో చేసారు ఈ మహానుభావులు.

 Balakrishn Comments On Akkineni Nageswara Rao , Nagarjuna , Balakrishna , Chira-TeluguStop.com

వీరి తర్వాతి తరం వాళ్ళు అప్డేట్ టెక్నాలజీ తో మన ముందుకు వచ్చినా కూడా నటన పరంగా ఓనమాలు నేర్చుకున్నాడు మాత్రం వీళ్లిద్దరి నుండి.అలాంటి లెజెండ్స్ వారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున( Nagarjuna ) మరియు నందమూరి బాలకృష్ణ కూడా తమ తరం లో టాప్ స్టార్స్ గా కొనసాగుతూ సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో చక్రం తిప్పుతున్నారు.

వీళ్లిద్దరు ఆ రేంజ్ లో సక్సెస్ అవ్వడానికి కారణం విభిన్నమైన ఆలోచన ధోరణి అని చెప్పొచ్చు.తమ తండ్రుల నుండి నటన నేర్చుకున్నారు కానీ, వారిని అనుసరిస్తూ మాత్రం వీళ్లిద్దరు సినీ ప్రయాణం చెయ్యలేదు.

Telugu Balakrishna, Chiranjeevi, Nagarjuna, Tollywood-Movie

వేరు వేరు దారులను ఎంచుకుంటూ విభిన్నమైన జానర్స్ లో సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించారు.నాగార్జున క్లాస్ , యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తే, బాలయ్య బాబు( balakrishna )కి ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ మరియు నాగేశ్వరరావు ఆరోజుల్లో ఎంతో మంచి స్నేహం గా ఉండేవారు.వీళ్లిద్దరి మధ్య స్నేహం అన్నదమ్ముల తో సమానంగా ఉండేది.అందుకే వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఆరోజుల్లో అన్ని సినిమాలు వచ్చాయి.కానీ వాళ్ళ కొడుకులు బాలకృష్ణ మరియు నాగార్జున మాత్రం అందుకు పూర్తి విరుద్ధం.

మొదటి నుండి వీళ్లిద్దరి మధ్య సఖ్యత ఉండేది కాదు.కెరీర్స్ ని ప్రారంభించిన కొత్తల్లో ఇద్దరు స్నేహం గానే ఉండేవారు కానీ, కాలం గడుస్తున్న కొద్దీ వీళ్ళ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

ఆ దూరం కాస్త అయిష్టంగా మారింది.

Telugu Balakrishna, Chiranjeevi, Nagarjuna, Tollywood-Movie

రీసెంట్ గా కూడా బాలయ్య నాగేశ్వర రావు ( Akkineni Nageswara Rao )అంటే నాకు ఎంతో ఇష్టం అని, తన సొంత కొడుకు లాగ చూసుకునేవాడని, నా దగ్గర అంత ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయని, కానీ ఆయన కొడుకు దగ్గర నుండి అలాంటివి దక్కలేదు అంటూ పబ్లిక్ గానే మొన్న మీడియా ముందు మాట్లాడాడు.దీనిని బట్టీ చూస్తుంటే నాగార్జున అంటే బాలయ్య బాబు కి ఎంత ద్వేషం అనేది అర్థం అవుతుంది.ఆయనకీ అంత ద్వేషం ఉండడానికి కారణం, నాగార్జున తన కంటే కూడా ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి కి విలువ ఇస్తాడనే.

తన సొంత అన్నయ్య ని భావించినట్టు భావించి, ఎప్పుడు చిరంజీవి భజన చేస్తుంటాడని, అందుకే బాలయ్య బాబు కి నాగార్జున అంటే ఇష్టం ఉండదు అని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ ఎప్పటి నుండి ఉంది.జరిగిన సంఘటనలు మొత్తం చూస్తే అది నిజమే అని అర్థం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube