సైలెంట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన మహేష్ విట్టా... ఫోటోలు వైరల్!

మహేష్ విట్టా ( Mahesh Vitta )పరిచయం అవసరం లేని పేరు యూట్యూబర్ గా పలు సిరీస్ లలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఫన్ బకెట్ అనే కామెడీ సిరీస్ ద్వారా ఈయన చిత్తూరు యాసలో మాట్లాడుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మహేష్ విట్టా అనంతరం సినిమాలలో కూడా అవకాశాలను అందుకున్నారు.

ఇకపోతే పుష్ప సినిమా కేశవ పాత్రలో నటించే అవకాశం ముందుగా మహేష్ కే వచ్చిందట.అయితే కొన్ని కారణాల వల్ల ఈ పాత్రలో నటించలేకపోయారని చెప్పాలి.

ఇలా ఇప్పటికే పలు సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఓ ఇంటివాడయ్యారు అని తెలుస్తుంది.

మహేష్ విట్టా ఎవరికి తెలియకుండా తన వివాహ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఈయన పెళ్లికి( Mahesh Vitta Marriage ) సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మహేష్ విట్టా తన చెల్లెలు ఫ్రెండ్ అయినటువంటి శ్రావణి( Sravani ) అనే అమ్మాయిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నారట అయితే వీరి ప్రేమ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసి కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని తెలుస్తోంది.

Advertisement

ఇక మహేష్ విట్టా వివాహం సెప్టెంబర్ రెండవ తేదీ కడప జిల్లా ప్రొద్దుటూరు( Proddatur )లోని హెల్త్ క్లబ్ ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు మహేష్ విట్టా ఇలా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారేంటి అంటూ ఆశ్చర్యపోవడమే కాకుండా, ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు