ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కు యువత మద్దతు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో చొప్పదండి నియోజకవర్గ యూత్ ప్రధానకార్యదర్శి కొమ్మబోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలానికి చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వారికి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.సిఎం కెసిఆర్ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ చేరుతున్నామని ప్రకటించారు.

స్థానిక బిడ్డ రవిశంకర్ నాయకత్వంలో చొప్పదండి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని నమ్మి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు యువకులు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.

యువతకు తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని అన్నారు.అభివృద్ధి గురించి కానీ, ఆపద గురించి గానీ వస్తే అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.

Advertisement
రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

Latest Rajanna Sircilla News