ఆరు హామీలతో కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు.. ప్రకటించనున్న సోనియా

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా ఆరు హామీలతో గ్యారెంటీ కార్డును విడుదల చేయనుంది.

 Sonia Will Announce Congress Guarantee Card With Six Guarantees-TeluguStop.com

ఈ మేరకు హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహిస్తున్న విజయభేరీ భారీ బహిరంగ సభా వేదికగా ఈ గ్యారెంటీ కార్డును పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ప్రకటించనున్నారు.వీటిలో మొదటిది మహాలక్ష్మీ పథకం.దీని ద్వారా కుటుంబంలోని ఒక మహిళకు నెలకు రూ.2500 సాయం అందించనుంది.దీంతో పాటు మహిళకు బస్సులో ఉచిత ప్రయాణం, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ అందించనుంది.

రెండవది రైతు భరోసా పథకం.ఈ పథకంలో భాగంగా ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయంతో పాటు వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ.15 వేల ఆర్థిక సాయం అందించనుంది.

మూడవది గృహాజ్యోతి పథకం.

గృహా అవసరాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది.

తరువాత ఇందిరిమ్మ ఇంటి పథకం.ఈ పథకం కింద గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది.

యువవికాసం పథకం.ఈ పథకం కింద విద్యార్థులకు రూ.5 లక్షలతో విద్యా భరోసా కార్డు అందించనుంది.

అదేవిధంగా చేయూత పెన్షన్ పథకం.ఈ స్కీమ్ ద్వారా రూ.4 వేల వృద్ధులకు పెన్షన్ అందించనుంది.

ఈ ఆరు హామీలను కాంగ్రెస్ తన గ్యారెంటీ కార్డులో భాగంగా ప్రకటించనుంది.అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube