ఎంత దారుణం.. డ్యాన్స్ చేస్తుండ‌గానే ఆగిన యువ‌కుడి గుండె

డ్యాన్స్ అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి.చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి పెద్ద వారి దాకా ప్ర‌తి ఒక్క‌రికీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం.

కానీ డ్యాన్స్ చేయ‌డం అంటే ఎవ‌రికి ప‌డితే వారికి సాధ్యం కాదు.కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే వ‌చ్చే అదృష్టం అది.అయితే ఎలా చేసినా స‌రే డ్యాన్స్ అనుకుని స‌ర‌దాగా ప్ర‌తి ఒక్క‌రూ పెండ్లి బ‌రాత్ ల‌లో డ్యాన్స్ చేస్తుంటారు.ఇలా డ్యాన్స్ ల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి.ఈ మ‌ధ్య ఇలాంటి వీడియోలు బాగా పెరిగిపోతున్నాయి.

పెండ్లి అంటే చాలు డ్యాన్స్‌లు చాలా కామ‌న్ అయిపోయాయి.అయితే ఇప్పుడు కూడా ఇలాంటి వైర‌ల్ వీడియోనే ఒక‌టి బాగా వైర‌ల్ అవుతోంది.

అయితే ఇది చాలా విషాద‌క‌ర‌మైన‌ది.డ్యాన్స్ చేస్తూనే కుప్ప కూలిపోయిన వీడియో ఇది.ఈ మ‌ధ్య యువ‌కులు కూడా ఇలా స‌డెన్ గా గుండె ఆగి చ‌నిపోవ‌డం నిజంగా చాలా బాధాక‌రం అనే చెప్పాలి.కాగా ఇప్పుడు మ‌ధ్య ప్ర‌దేశ్‌లో ఓ జ‌రిగిన ఓ పెండ్లి వేడుక‌లో ఓ యువ‌కుడు ఎంతో ఇష్టంగా డ్యాన్స్ చేస్తున్నాడు.

Advertisement

చూసేందుకు చాలా యువ‌కుడిగా ఉన్నాడు.అత‌న్ని చూస్తే గుండె ఆగి చ‌నిపోయే వ్య‌క్తి కాద‌ని అంద‌రికీ అర్థం అవుతుంది.

కానీ విధి విచిత్ర‌మైన‌ది క‌దా.

ఈ రాష్ట్రంలోని బేతుల్ జిల్లాలో ఉండే దోరి అనే ఊరిలో సోను కుమ్రే పెండ్లి జరిగింది.ఇక వీరి రిసెప్షన్ లో అంత‌లాల్ అనే యువ‌కుడు స్టెప్పులు వేస్తున్నాడు.అయితే డ్యాన్స్ చేస్తుండ‌గానే మ‌ధ్య‌లో పడిపోయాడు.

కాగా అత‌ను ఏదో స‌ర‌దాగా అలా ప‌డిపోయాడు అని అంతా అనుకున్నారు.కానీ అత‌ను గుండె ఆగి ప‌డిపోయాడు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఇక ఎంత‌కూ లేవ‌క‌పోవ‌డంతో అత‌న్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.కానీ అప్ప‌టికే అత‌ని గుండె చ‌ప్పుడు ఆగిపోయింది.

Advertisement

దీంతో పెండ్లి వేడుక‌లో విషాదం నెల‌కొంది.ఈ వీడియో ఇప్పుడు అంద‌రి గుండెల్ని క‌రిగిస్తోంది.

తాజా వార్తలు