ఈ సంవత్సరం భారీ హిట్లు కొట్టబోతున్న యంగ్ హీరోలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ అహర్నిశలు కష్టపడుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమం లో వాళ్ళు చేసే సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ఉంటాయి.

ఇక ఇప్పుడు యంగ్ హీరోలు( Young Heroes ) సైతం వాళ్ల సినిమాలు సూపర్ సక్సెస్ సాధించాలనే ఉద్దేశ్యం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అయితే విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తున్నట్టు గా తెలుస్తుంది.అందులో ముఖ్యంగా సందీప్ కిషన్( Sandeep Kishan ) హీరోగా వస్తున్న ఊరు పేరు భైరవకోన( Ooru Peru Bhairavakona ) అనే సినిమా వైవిధ్యమైన కథాంశం తో తెరకెక్కుతుంది.

ఈ సినిమాతో సందీప్ కిషన్ మరొకసారి మంచి విజయాన్ని సాధించబోతున్నట్టు గా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఇదిలా ఉంటే నిఖిల్ కూడా ఇప్పుడు వైవిధ్యమైన కథల తో మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది.

నిఖిల్( Nikhil ) గత సినిమాలు అయిన 18 పేజెస్ అలాగే స్పై సినిమాలు తీవ్రంగా నిరశపరచడంతో ఇప్పుడు ఆయన ఒక వైవిధ్యమైన కథాంశం తో వచ్చి సక్సెస్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో కనక నిఖిల్ మెప్పించినట్లైతే మరొకసారి తను పాన్ ఇండియా( Pan India Movie ) లెవెల్ లో తన సత్తాను చాటుకున్న హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు.ఒకవేళ ఈ సినిమా కనక ఫ్లాప్ అయినట్టయితే నిఖిల్ కెరియర్ డైలమాలో పడుతుంది.

Advertisement

అందువల్ల తర్వాత చేయబోయే సినిమాకోసం ఆచి తూచి అడుగులేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఇక వీళ్లతో పాటు గా ఆది సాయికుమార్,( Adi Saikumar ) కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) లాంటి హీరోలు కూడా ఇప్పుడు వైవిధ్యమైన కథంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టుగా తెలుస్తుంది.ఇక యంగ్ హీరోలు అందరు ఈ సంవత్సరం మంచి సక్సెస్ లను సాధించాలని చూస్తున్నారు.ఇక ఈ సంవత్సరం వీళ్లంతా మంచి సక్సెస్ లు కొడితే ఇక సినిమా ఇండస్ట్రీ కూడా కళకళలాడుతుంది.

Advertisement

తాజా వార్తలు