ప్రస్తుత కాలంలో కొందరు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కువకాలం గడుపుతూ మరియు గుర్తుతెలియని వ్యక్తులతో స్నేహం చేస్తూ ఆపై ప్రేమలో పడి మోసపోతున్నారు.తాజాగా ఓ యువతి టిక్ టాక్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తి మాయ మాటలు నమ్మి ప్రేమించి సర్వం అర్పించి చివరికి పెళ్లి విషయానికి వచ్చేసరికి మోసపోయానని గ్రహించి న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక నగర పరిసర ప్రాంతంలో ఓ యువతి నివాసం ఉంటోంది.అయితే ఈమె కాలక్షేపం కోసం అప్పుడప్పుడూ టిక్ టాక్ వీడియోలు చూస్తూ, చేస్తూ ఉండేది.
అయితే ఇదే నగరంలో 34 సంవత్సరాలు కలిగినటువంటి ఓ వ్యక్తి కూడా నివాసముంటున్నాడు.అయితే ఇతడు తరుచూ యువతి వీడియోలను చూస్తూ లైక్ చేయడం, కామెంట్ చేయడం వంటివి చేస్తుండేవాడు.
దీంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్త ప్రేమ వైపుకి దారి తీసింది.
కాగా ఇద్దరూ ఒకే నగరంలో నివసిస్తుడంతో అప్పుడప్పుడూ కలుసుకునేవారు.దీంతో యువతి తనను పెళ్లి చేసుకోవాలని వ్యక్తిని బలవంత పెట్ట సాగింది.
అయితే ఎన్నిసార్లు పెళ్లి గురించి ప్రస్తావన తెచ్చినా ఆ వ్యక్తి దాటవేస్తూ ఉండడంతో చివరికి తాను మోసపోయానని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.అయితే బాధితురాలు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తి గురించి ఆరా తీయగా అతడికి అప్పటికే పెళ్లయి దాదాపుగా నలుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుసుకున్నారు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అంతేగాక గుర్తుతెలియని వ్యక్తులతో సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రేమలు, స్నేహాలు మంచిది కాదని కొందరు కామెంట్ చేస్తున్నారు.