మే 31వరకు శ్రీవారి దర్శనం నిలిపివేత!

కరోనా వైరస్ ని నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే.ఈ లాక్ డౌన్ తో అన్ని ఆగిపోయాయి.

 Corona Virus, Lock Down, Telugu States, Central Government, Tirumala, Ttd, Mask,-TeluguStop.com

అలానే గత రెండు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి.భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించడం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో శ్రీవారి దర్శనం నిలిపివేశారు.

ఇంకా నిన్నటితో 3.0 లాక్ డౌన్ ముగిసిపోవడంతో ఈరోజు నుండి రోజుకు పది వేలమంది తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవచ్చు అని కొన్ని వార్తలు వినిపించాయి.అయితే ఇప్పుడు మళ్లీ మే 31 వ తేదీ వరకు శ్రీవారి దర్శనం నిలిపి వేస్తున్నట్టు ప్రకటించారు.నిన్న రాత్రి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగించడంతో తిరుమల శ్రీవారి దర్శనాల రద్దును కూడా ఈ నెల 31వరకు టీటీడీ కొనసాగించనుంది.

కాగా శ్రీవారి దర్శనంపై ఈరోజు లేదా రేపులోపు అధికార ప్రకటన చేయనున్నారు.దర్శనాలను కొనసాగిస్తే భక్తులు మాస్కులు, శానిటైజర్ లు, భౌతికదూరం పాటించేలా రెండు రోజుల కిందట క్యూలైన్లు, లడ్డూ కౌంటర్ల ముందు అధికారులు మార్కింగ్‌ చేయించిన విషయం విదితమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube