ఆ కాఫీ కేఫ్ లో గుడ్లగూబలు చూస్తూ కాఫీ తాగొచ్చట.. ఎక్కడో తెలుసా..?

ప్రజలు గుడ్లగూబలను దగ్గరనుంచి చూడటం చాలా అరుదు.గుడ్లగూబలకు అద్భుతమైన కంటి చూపు, వినికిడి శక్తి మరియు భయంకరమైన రూపం ఉంటుంది.

ఇవి కేవలం చీకటి ప్రదేశాల్లోనే నివసిస్తుంటాయి.అలాగే చీకట్లోనే వేటాడుతూ ఉంటాయి.

అందుకే మనకు అవి చాలా తక్కువగా కనబడుతుంటాయి.వాటి రూపం తో పాటు వాటి అరుపు కూడా బీతిని కలిగిస్తుంది.

అయితే సాధారణంగా గుడ్లగూబలు మనుషులపై దాడి చేయవు కాని గతంలో గుడ్లగూబల దాడి వల్ల కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, తీవ్రంగా గాయపడిన వారు ఉన్నారు.అందుకే వాటి జోలికి పోవడానికి మనుషులను భయపడుతుంటారు.

Advertisement

కానీ దుబాయ్ లో ఒక కాఫీ కెఫే లో పది విభిన్నమైన జాతుల గుడ్లగూబలు ఉంటాయట.అవి కేవలం ఈ కెఫే లోనే కనిపిస్తాయట.

అయితే ఆ గుడ్లగూబలను యజమానులు కావాలనే కెఫే లో తెచ్చి పెట్టుకున్నారట.ఎందుకు అని అడిగితే అరుదైన గుడ్లగూబలను చూస్తూ కాఫీ తాగితే ఫుల్ మజా వస్తుందని ఓనర్ మొహమ్మద్ మహఫూద్ అల్ అంటున్నారు.

అయితే అడవిలో బతికే గుడ్లగూబలు కెఫే లో బతకడం చాలా కష్టం.అందుకే వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు వెటర్నరీ డాక్టర్స్ కూడా ఎల్లవేళలా అందుబాటులో ఉంటారట.

వాటి సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ కొరకు కేఫ్ సిబ్బంది ట్రైనింగ్ కూడా తీసుకున్నారట.వాటికి ఇచ్చే ఆహారంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అయితే అబుదాబిలోని అల్ సీఫ్ గ్రామంలో ఉన్న ఈ భూమా అనే కెఫే లో అరుదైన గుడ్లగూబలను చూస్తూ కాఫీ తాగినందుకు రోజుకు వందలమంది కస్టమర్లు తరలివస్తున్నారు.అయితే అత్యంత రుచికరమైన కాఫీలకు ప్రసిద్ధిగాంచిన ఈ కెఫే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది.

Advertisement

గుడ్లగూబల సందర్శనకు ఒక నిర్ణీత ప్రైస్ కూడా పెట్టారు.ఇక్కడ ఒక కప్పు కాఫీ ఆగిన తర్వాత కేవలం గుడ్లగూబలను వీక్షించినందుకు గాను AED 70 (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్) చెల్లించాలట.అంటే మన భారతీయ కరెన్సీలో రూ.1,400 రూపాయలు అన్నమాట.పిల్లలకైతే 50 అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్స్ గా ఎంట్రీ ఫీజు నిర్ణయించారు.

ఏది ఏమైనా దుబాయ్ అనగానే మనకు ఎత్తైన భవనాలు, పెట్రోల్ బావులే గుర్తొస్తాయి.కానీ ఆకట్టుకునే హోటల్స్, ఆశ్చర్యపరిచే కాఫీ కెఫేస్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

తాజా వార్తలు