ఆ ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నా.. శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు..?

కమల్ హాసన్ తనయగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు శృతిహాసన్.

వేర్వేరు కారణాల వల్ల శృతిహాసన్ రెండు మూడేళ్లు సినిమాలకు దూరమవుతున్నా రీఎంట్రీలో శృతికి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి.

ఇప్పటికే పదుల సంఖ్యలో సినిమాలలో నటించి ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న శృతిహాసన్ నటించిన వకీల్ సాబ్ వచ్చే నెలలో విడుదల కానుంది.ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తున్నారు.

వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల కానుంది.అయితే తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడిన శృతిహాసన్ తాను ఒక ఆరోగ్య సమస్యతో బాధ పడుతున్నానని ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

ఒక రకమైన యాంక్జైటీతో బాధ పడుతున్నానని శృతిహాసన్ వెల్లడించారు.తనకు 30 సంవత్సరాల వయస్సు వచ్చిన తరువాత ఈ సమస్యతో బాధ పడుతున్నట్టు గుర్తించానని ఆమె తెలిపారు.

Advertisement

కొంతమందికి ఈ సమస్య పెద్ద సమస్య కాకపోయినా తాను మాత్రం ఈ సమస్య వల్ల చాలా ఇబ్బంది పడ్డానని శృతిహాసన్ చెప్పుకొచ్చారు.ఈ ఆరోగ్య సమస్య వల్ల స్టేజ్ పైకి రావాలన్నా, మాట్లాడాలన్నా తనకు భయంగా ఉండేదని ఆమె అన్నారు.టాక్ థెరపీ ఈ డిజార్డర్ నుంచి బయటపడటంలో ఉపయోగపడుతుందని శృతిహాసన్ తెలిపారు.

శృతిహాసన్ ఆరోగ్య సమస్య గురించి తెలిసి ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు.క్రాక్ సినిమాతో ఈ ఏడాది తొలి సక్సెస్ ను అందుకున్న శృతిహాసన్ వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నటిస్తున్నారు.

పాత్ర నిడివి కొంత సమయమే అయినా ఈ పాత్ర కోసం శృతిహాసన్ రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.వకీల్ సాబ్ మూవీతో శృతి హాసన్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు