సింహాచలం ప్రాచీన పురాతన దేవాలయం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.శుక్రవారం ఆయన సింహాద్రి అప్పన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేవాలయం ఆస్తులు దుర్వినియోగం అవుతుండటం వాస్తవం.కాపాడడానికి సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు.ధర్మకర్త మండలికి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఉంది.800 ఎకరాల భూమి పరాధీనం చేసిన తర్వాత విచారణకు ఆదేశించాం.ధర్మకర్త మండలకి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ఉంది.ఎనిమిది వేల కోట్లు విలువైన ఆస్తులు పరాధీనం అయితే గత ప్రభుత్వంలో ధర్మకర్తలు, ట్రస్టీలు ఏం చేశారు.దేవస్థానం అప్పగించాలని మనోవేదన మనసులో ఉంది.ధర్మకర్త.
ధర్మకర్త గా ఉండాలి తప్పితే అథర్మ కర్తా కారాదు .అశోక్ గజపతిరాజు ధర్మకర్తా.! అథర్మ కర్తా.! అని ప్రశ్నించారు.
పైకి చాలా నితులు చెబుతాడు.లోపలంతా కుట్రలు చేస్తాడు.ఏం ప్రశ్నించినా వంశాచారం అంటాడు… అపచారం చేస్తాడు.850 ఎకరాలు పరాధీనం అయితే అశోక్ చూస్తూ ఎందుకు మిన్నకుండి పోయారు తనకు కూడా వాటా ఉందా.! తేల్చి చెప్పాలి.

తప్పు చేయలేదని మనస్సాక్షిగా చెప్పాలి.పబ్లిక్ పార్క్ లో కూర్చుందాం రా అని అశోక్ అని సవాల్ చేశారు.నేను అడిగిన ప్రశ్నలకు అశోక్ సూటిగా జవాబు చెప్పాలి ఆయన అడిగిన దానికి నేను సమాధానం చెబుతాను అన్నారు.
మాన్సాస్ ట్రస్ట్ లో చాలా అవినీతి జరిగిందని దీనిపై తెదేపా సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుతో చర్చకు సిద్ధమని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు.సింహాచలం అప్పన్న స్వామి దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు మానస ట్రస్ట్ లో జరిగిన అవినీతిని త్వరలో బయటపెడతామని చెప్పారు దర్యాప్తు వేగవంతం జరుగుతుందని బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు
.