రాధాకృష్ణా.. బహిరంగ చర్చకు నేను రెడీ 

గత కొద్ది రోజులుగా ఏబీఎన్ ఛానల్ అధినేత వేమూరి రాధాకృష్ణ కు( Vemuri Radhakrishna ) వైఎస్ఆర్సిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డికి( Vijaya Sai Reddy ) మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే దమ్ముంటే విజయ సాయి రెడ్డి తనతో చర్చకు రావాలంటూ రాధాకృష్ణ సవాల్ విసిరారు.

దీనిపై తాజాగా స్పందించిన విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా రాధాకృష్ణకు సవాల్ విసిరారు. రాధాకృష్ణ ! బహిరంగ చర్చకు నేను రెడీ నీ చాలెంజ్ ( Challenge ) స్వీకరిస్తున్నా ! ఫేస్ టు ఫేస్ కౌంటర్ కు ఎన్ కౌంటర్.

నేను సిద్ధం .నువ్వు సిద్ధమా ? అయినా నీ పక్షపాత టీవీ ఛానల్ ఆంధ్రజ్యోతికి నేను రావాలా ? ఢిల్లీలో ఎన్జీవోలు,  మేధావులు,  జర్నలిస్టులు అన్ని టీవీ చానల్స్ అందరినీ ఆహ్వానించి ప్రజా వేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందాం. 

నేను ఐక్యరాజ్యసమితి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఎక్కడికైనా రెడీ ఎవరి చిత్తశుద్ధి ఏంటో తేల్చుకుందాం.తగ్గేదేలే ! భయపడేదేలే .గత ఐదేళ్లలో మద్యం,  ఖనిజం, సిండికేట్ బ్రోకర్లు,  మిగతా ఇతరత్రా డీల్స్ లో మీ బాస్ పేరు చెప్పి వసూలు చేసి వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కులం కషంగా చర్చిద్దాం.! జర్నలిస్ట్ కాలనీలో నువ్వుండే ప్యాలస్,  నేను ఉండే బాడుగిళ్ళు కూడా చూపిద్దాం.

Advertisement

ఫిలింనగర్ మెయిన్ రోడ్డులో నువ్వు కొన్న నూరుకోట్ల విలువ చేసే స్థలం,  దాంట్లో ఇంకో 200 కోట్లతో కడుతున్న ఆఫీస్ ను కూడా పరిశీలిద్దాం.  రాధాకృష్ణ నీ పత్రిక , టీవిని ఏ పునాదులు పైన నిర్మించుకున్నావో మరువద్దు.

నష్టాలు వస్తున్నాయని ఇప్పటికీ అమెరికా వెళ్లి ఎన్నారైల దగ్గర చందాలు తెచ్చుకోవడం వాస్తవం కాదా.

కలర్ బ్లైండ్ నెస్ లాగా మీ కళ్ళకు కొందరే కనిపిస్తారు మిగతా వాళ్లంతా నీవేమన్నా పడాలి.నీకోసం సెటిల్మెంట్ల సంపాదనకు ఉపయోగపడాలి అనుకునే స్వార్థపూరిత మైండ్ నీది.సుద్దులు చెప్పడం మానుకో ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి.

రాధాకృష్ణ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కలంతో పోరాడి ఇందిరాగాంధీని ఎదిరించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యవస్థాపకుడు రామ్నాథ్ గోయాంకు గుర్తున్నాడా ? ఆనాడు ఆయన చేసిన సాహసం వల్లే దేశంలో కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఊపిరి పోసుకుంది.గొయెంకో వారసులు ఇప్పటికీ మీడియాను నమ్ముకుని సాధారణ జీవితాలు గడుపుతున్నారు.92 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆస్తులు నీ నెలరోజుల సెటిల్మెంట్ సంపాదనతో సరిపోవు అంటే నీవు ఎంత అవినీతిపరుడువో వేరే చెప్పాలా ? అంటూ విజయ సాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

క్యాబినెట్ భేటీ లో కీలక నిర్ణయం ... మహిళలకు పండుగే 
Advertisement

తాజా వార్తలు