వైసీపీ ఎంపీ జక్కంపూడి రాజా కి సవాల్ విసిరిన ఎంపీ భరత్..!!

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైసీపీ ఎంపీ భరత్ పై సంచలన ఆరోపణలు చేశారు.

ఎంపీ భరత్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని.

అందువల్లే పరిషత్ ఎన్నికలలో కొన్ని చోట్ల తీవ్రంగా వైసీపీ పార్టీ ఓడిపోవడం జరిగిందని ఆరోపించారు.జిల్లాలో పార్టీని నిర్వీర్యం చేసే దిశగా ఎంపీ భరత్ ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులతో ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు.

టీడీపీ ఎమ్మెల్యే బచ్చయ్య చౌదరితో.మరికొంత మంది తో ఎంపీ భరత్ రహస్య మంతనాలు జరిపారని.

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు.

Advertisement

కడియం మండలంలో వైసీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఎంపీ భరత్ అని పేర్కొన్నారు.దీనంతటికీ గల కారణం టీడీపీ ఎమ్మెల్యేలతో నాయకులతో.

భరత్ కుమ్మక్కయ్యారని పేర్కొన్నారు.దీంతో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ భరత్ స్పందించారు.

నేను ఎవరితో అనగా టీడీపీ ఎమ్మెల్యేలతో నాయకులతో సమావేశమైనట్లు ఆయన దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టాలని ఇష్టానుసారంగా ఆరోపణలు చేయకూడదని ఎంపీ భరత్ స్పష్టం చేశారు.ఆధారాలు ఉంటే బయట పెట్టండి.

ఓపెన్ చాలెంజ్ అంటూ వైసీపీ ఎంపీ జక్కంపూడి రాజా కి ఎంపీ భరత్ సవాల్ విసిరారు.తాను ఎప్పుడూ కూడా పార్టీ గీత గాని ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచేలా ఎక్కడ వ్యవహరించలేదని తనపై లేనిపోని ఆరోపణలు చేయకూడదని వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన కామెంట్లు పై తీవ్రస్థాయిలో ఎంపీ భరత్ స్పందించారు.

డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలివే.. అన్ని కోట్లు వస్తే హిట్టవుతుందా?
Advertisement

తాజా వార్తలు