విశాఖ: తనపై టీడీపీ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని విశాఖ సీబీఐ కి వినతి పత్రం ఇచ్చిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు.రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కామెంట్స్.800 కిలోమీటర్లు ప్రయాణించి సిబిఐ ఆఫీసుకు వచ్చాను.టిడిపి దయవల్ల ఇక్కడ కు వచ్చాను.
ఏ ఏమ్మేల్యే కు సిబిఐ తో పని ఉండదు ఎ ఎమ్మెర్వో నో జిల్లా అధికారులతో పని ఉంటుంది.టిడిపి విష ప్రచారం వల్ల నేను ఇక్కడ కు వచ్చాను.
లోకేష్ రెండు సార్లు ప్రొద్దుటూరు వచ్చి నా పై అనేక ఆరోపణలు చేసారు.
నేను దొంగనోట్లు వ్యాపారం హుక్క, జూదం,భూకబ్జా,క్రికెట్ బెట్టింగ్,ఏర్రచందంనం ఆసాంఘీక కార్యక్రమాలు చేస్తున్నానని మాట్లడుతున్నారు.
ఇవన్నీ నిజం కాదని సిబిఐ విచారణ కు సిద్దమా అని టిడిపి నేతలు సవాల్ విసిరారు.వారి సవాల్ స్వీకరించి నేను సిబిఐ కార్యలయంకు వచ్చాను.నాపై విచారణ చేయ్యాలని సిబిఐ అధికారులను కోరాను.రసపుత్ర రజనీ దొంగనోట్లు దొరికింది.
ఆమె ను పార్టీ నుండి సస్పెండ్ చేసాం.
డైరెక్టర్ పదవి నుండి తొలగించాము.ఆమె నాతో ఫోటో దిగితే నేను ఆమెతో కలసి దొంగనోట్ల వ్యాపారం చేసామని ప్రచారం చేసారు.నాయకులతో అనేక మంది ఫోటోలు దిగుతారు వారి నేరాలన్ని నాయకులతో సంభందం ఉన్నట్టేనా.
మీ నాయకుడు మీద కేసులు ఉండే వాటిని పరిష్కారం చెయ్యకుండా స్టే ల మీద బ్రతుకుతున్నారు.మీరు ఎంత విష ప్రచారం చేసిన మీరు అధికారంలోకి రావడం కల్లా….
లోకేష్ మీద పరువునష్టం కేసు పెడుతున్నాం కోర్టుకు వెళ్తాం.