మరికొన్ని రోజుల్లో శీతాకాలం ముగియనుంది.నిప్పులు కక్కే వేసవి త్వరలో రానుంది.
బయటకు వెళ్తే చెమటలు కక్కుతూ ఇంటికి వస్తుంటాం.పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి.
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.దీంతో వేసవి వస్తున్న ప్రస్తుత తరుణంలో అంతా ఏసీలు కొనుగోలుకు మొగ్గు చూపుతుంటారు.
ఫలితంగా వేసవిలో కాస్త ఉపశమనం దక్కుతుంది.భారతదేశంలో మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన నాణ్యమైన ఏసీలు అందుబాటు ధరలకే లభిస్తున్నాయి.
వాయిస్ కంట్రోల్, యాంటీ -ఫ్రిజ్ థర్మోస్టాట్, వైరల్ ఫిల్టర్లు, కన్వర్టబుల్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్న ఏసీలు ఉన్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.
Whirlpool 1.5 టన్ స్ప్లిట్ ఏసీ: వేరియబుల్ స్పీడ్ కంప్రెషర్లు ఇందులో ఉన్నాయి.భారతదేశంలో లభించే ఉత్తమ ఏసీలలో ఇది కూడా ఒకటి.ఈ 1.5 టన్ ఏసీని మధ్యస్థ -పరిమాణం ఉండే గదులకు చక్కగా ఉపయోగపడుతుంది.దీనిలో డస్ట్ ఫిల్టర్, స్టెబిలైజర్ వంటి ప్రత్యేక లక్షణాలున్నాయి.దీని ధర రూ.39,990గా నిర్ణయించారు.

LG 1.5 టన్ స్ప్లిట్ ఏసీ: 1.5 టన్ సామర్థ్యం కలిగిన ఈ ఏసీలో ఇన్వర్టర్ కంప్రెషర్, రిమోట్ కంట్రోల్, ఫాస్ట్ కూలింగ్, ఆటో క్లీన్ వంటి తాజా ఫీచర్లు ఉన్నాయి.దీని ధర రూ .46,490గా నిర్ణయించారు.
Samsung 1.5 టన్ స్ప్లిట్ ఏసీ: ఇందులో యాంటీ బాక్టీరియల్ ఫిల్టర్, ఆటో క్లీన్ వంటి అధునాత ఫీచర్లు ఉన్నాయి.1.5 టన్నుల సామర్థ్యం ఉండే ఈ ఏసీ చిన్న గదికి చక్కగా సరిపోతుంది.దీని ధర రూ.45,099గా ఉంది.

Daikin 1.5 టన్ స్ప్లిట్ ఏసీ: ఇందులో హై యాంబియంట్ ఆపరేషన్, డస్ట్ ఫిల్టర్, సెల్ఫ్ -డయాగ్నోసిస్ వంటి తాజా ఫీచర్లు ఉ న్నాయి.ఇవే కాకుండా ఈ ఏసీలో ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్, డీహ్యూమిడిఫైయర్, ఫాస్ట్ కూలింగ్ వంటి ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయి.దీని ధర మార్కెట్‌లో రూ.44,490గా ఉంది.
Havells 1.5 టన్ విండో ఏసీ: 1.5 టన్ సామర్థ్యం ఉండే ఈ ఏసీ విండో ఏసీలలో ఆదరణ పొందిన మోడల్.LED డిస్‌ప్లే, క్లీన్ ఎయిర్ ఫిల్టర్, సెల్ఫ్ -డయాగ్నోసిస్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.దీని ధర రూ .26,000గా ఉంది.