చంద్రబాబుపై వైసీపీ మంత్రి మెరుగు నాగార్జున సీరియస్ వ్యాఖ్యలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా మాటలు యుద్ధాలు జరుగుతున్నాయి.

2024 ఎన్నికలలో( AP 2024 Elections ) ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు భారీ ఎత్తున వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.ఈ క్రమంలో రకరకాల కార్యక్రమాలతో ప్రజల మధ్య తిరుగుతూ విస్తృత పర్యటనలు చేపడుతున్నారు.

ఇదే సమయంలో పొత్తులు మరియు అభ్యర్థుల ఖరారు విషయాలలో నేతలు చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు విపక్షాలపై భారీ ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు.

తాజాగా వైసీపీ మంత్రి మెరుగు నాగార్జున( YCP Minister Merugu Nagarjuna ) ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబుపై( Chandrababu Naidu ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రంలో పేదల కోసం వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు( Welfare Schemes ) తీసుకొస్తుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో సంక్షేమ పథకాలపై చర్చలకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

Advertisement

చంద్రబాబు వయసు మీద పడటంతో మానసిక స్థితి బాగా లేదని ఎద్దేవా చేశారు.తెలుగుదేశం పార్టీ ( TDP ) హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరిగాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు ఆనాడు కామెంట్లు చేసినట్లు మంత్రి మెరుగు నాగార్జున సంచలన ఆరోపణలు చేశారు.

Advertisement

తాజా వార్తలు