ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పై వైసీపీ అధిష్టానం ఆగ్రహం..!!

వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం తెలిసిందే.గత కొంతకాలంగా ఆనం వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు పుకార్ల షికారులు చేస్తున్నాయి.ఈ క్రమంలో నాలుగు సంవత్సరాలలో ప్రజలకు ప్రభుత్వం ఏం చేసింది.? ఎలా ఓట్లు అడగాలి.? గ్రామాల్లో ఒక రోడ్డు వేయలేదు.కనీసం గుంతకు తట్టెడు మన్నుపోసి కూడా పూడ్చలేకపోయాం.

అని కామెంట్లు చేశారు.తాజాగా గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలకు బిల్లులు ఇవ్వకపోవడం పై ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దీంతో పార్టీలోనే ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడంతో వైసీపీ అధిష్టానం ఎమ్మెల్యే ఆనం పై సీరియస్ అయింది.పార్టీ ఇన్చార్జి పదవి నుండి ఆనం రామనారాయణరెడ్డిని తొలగించి .నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియమించింది.ఇక ఇదే సమయంలో పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆమంచి కృష్ణమోహన్ ను నియమిస్తూ వైసీపీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

తాజా వార్తలు