ఒక్కొక్కరుగా తిరుగుబాటు మొదలుపెట్టారే ? 

ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో టిడిపి,  జనసేన, బిజెపి కూటమి గెలిచి అధికారంలోకి వచ్చింది.వైసిపి( YCP ) ఊహించని స్థాయిలో చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.

175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు.దీంతో ప్రతిపక్ష హోదా కూడా వైసిపి కోల్పోయింది.

వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరువయ్యామని , పెద్ద ఎత్తున ఏపీలో సంక్షేమ పథకాలు అమలు చేశామని,  2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని దాదాపుగా అమలు చేశామని, మళ్లీ రెండోసారి విజయం దక్కుతుందని వైసిపి అధినేత జగన్( YS Jagan ) భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి కొత్తవారికి అవకాశం ఇచ్చారు.

సామాజిక వర్గాల సమన్యాయం పేరుతో భారీగా అభ్యర్థుల మార్పు చేర్పులు చేపట్టారు.

Advertisement

ఐప్యాక్ సంస్థ అందించిన రాజకీయ వ్యూహాలను అమలు చేశారు.అయినా అవేమీ వైసీపీకి వర్కౌట్ కాలేదు.ఇక ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి వైసిపి నేతలు సమీక్షలు చేసుకుంటున్నారు.

ఈ సందర్భంగా కొంతమంది వైసిపి నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ మంత్రులు ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ పార్టీ అధినేత తీరుపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.కొద్దిరోజుల క్రితం రాజానగరం వైసిపి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా( Jakkampudi Raja ) ఓటమి కి గల కారణాలను వివరిస్తూ జగన్ వైఫల్యాలను ఎత్తిచూపే ప్రయత్నం చేశారు.

జగన్ కొంతమంది అధికారులను గుడ్డిగా నమ్మారని ,అందుకే వైసిపి ఓడిపోయిందని అన్నారు.ముఖ్యంగా ధనుంజయ రెడ్డి లాంటి అధికారుల వల్ల వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని జక్కంపూడి రాజా మండిపడ్డారు.

ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) కూడా వైసిపి వైఫల్యాలపై మాట్లాడారు.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

వాలంటీర్ వ్యవస్థ విఫలం కావడంతో నే ఈ ఫలితాలు వచ్చాయని అన్నారు .తాజాగా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ( Kottu Satyanarayana ) కూడా జగన్ వైఫల్యాలపై స్పందించారు.జగన్ కొంతమంది అధికారులను గుడ్డిగా నమ్మడం వల్లే వైసిపి ఓడిపోయింది అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

ఐపాక్ సంస్థ వాలంటీర్ వ్యవస్థ వల్ల వైసీపీ ఓడిపోయిందని కొట్టు సత్యనారాయణ అన్నారు ఆఫీసులో కూర్చుని ఏపీ రాజకీయాలను ఐ ప్యాక్ సంస్థ శాసించే ప్రయత్నం చేసిందని, అసలు గ్రౌండ్ రిపోర్ట్ వాళ్లకు తెలియదని, ఐ ప్యాక్ సంస్థ ఒక పనికిమాలిన సంస్థ అంటూ కొట్టు సత్యనారాయణ విమర్శించారు.వీటితోపాటు మరికొంతమంది వైసిపి నాయకులు బహిరంగంగా జగన్ అప్పటి నిర్ణయాలను తప్పుపడుతూ బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు.

తాజా వార్తలు