వైరల్ వీడియో: ఒక్కసారిగా విమానంలో మంటలు.. పైలెట్ వెంటనే..

తాజాగా టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో ( Toronto Pearson Airport )ఎయిర్ కెనడా బోయింగ్ ఫ్లైట్ AC872 విమానంలో టేకాఫ్ అయిన 30 నిమిషాలకే మంటలు చెలరేగాయి.విషయాన్ని గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి ఘోర ప్రమాదం నుండి తప్పించాడు.

 Viral Video Suddenly The Plane Caught Fire The Pilot Immediately , Viral Video,-TeluguStop.com

పారిస్‌కు వెళ్లే విమానం రన్‌వేపై నుంచి టేకాఫ్ అయ్యి 30 నిమిషాలకే ఈ సంఘటన జరిగింది.అధికారుల నివేదించిన ప్రకారం.

విమానం రాత్రి 8:46 గంటలకు బయలుదేరి., తిరిగి సర్కిల్ చేసి టొరంటో పియర్సన్ విమానాశ్రయంలో రాత్రి 9:50 గంటలకు ల్యాండ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

ఇక ఈ ఘటనకు సంబంధించి తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో ( Social media )తెగ వైరల్ గా మారింది.బోయిన్ ఫ్లైట్ కుడి ఇంజన్ నుంచి మంటలు వస్తున్నట్లుగా ఈ వీడియోలో కనబడుతుంది.విమానం నుండి చిన్న పేలుడు శబ్దం కూడా వినిపిస్తుంది.

ఈ నేపథ్యంలోనే పైలట్ చాకచేక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం నుంచి తప్పించాడు.ఈ సంఘటన జరిగినప్పుడు విమానంలో 400 మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు.

ఇక ఫ్లైట్ ల్యాండింగ్ తర్వాత అందరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.ఆ రాత్రి తర్వాత టొరంటో నుండి బయలుదేరే మరొక విమానంలో( Flight ) ప్రయాణికులకు వసతిని ఏర్పాటు చేసి పంపించారు.

ఇంజన్ కంప్రెసర్ ( Engine compressor )వల్లే మంటలు చెలరేగాయని ఎయిర్ కెనడా ప్రతినిధి తెలియజేశారు.విమానం ల్యాండ్ అయిన తర్వాత అధికారులు ఏర్పాటు చేసిన రెస్పాన్స్ వెహికల్స్ ద్వారా తనిఖీ చేయగా అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.ప్రస్తుతం విమానంలో ఏర్పడిన మంటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube