Nara Lokesh : రెడ్ బుక్ చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారు..: లోకేశ్

శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో టీడీపీ నేత నారా లోకేశ్( TDP Nara Lokesh ) శంఖారావం సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ( YCP )పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలో అధికారులు నీతి, నిజాయితీతో పని చేయాలని సూచించారు.

రెడ్ బుక్( Red Book ) చూసి వైసీపీ నేతలు భయపడుతున్నారని లోకేశ్ తెలిపారు.

అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) ఇచ్చే సలహాలు అన్నీ పనికిమాలిన సలహాలేనని విమర్శించారు.సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయన్న లోకేశ్ తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ గెలుపుకు దొంగ ఓట్లే కారణమని ఆరోపణలు చేశారు.దొంగ ఓట్ల వ్యవహారంపై త్వరలోనే విచారణ నివేదిక వస్తుందన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన వారంతా జైలుకు వెళ్తారని తెలిపారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు