జగన్ కళ్లలో ధీమా.. వైసీపీ నేతల్లో నమ్మకం.. రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగరవేయనుందా?

ఏపీలో మళ్లీ వైసీపీ( YCP ) జెండానే ఎగరబోతుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

జగన్( Jagan )కళ్లలో ధీమా, వైసీపీ నేతల్లో నమ్మకం చూసిన నెటిజన్లు రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగురుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని చెబుతున్నారు.

శ్రీకాకుళం నుంచి కర్నూలు( Srikakulam to Kurnool ) వరకు ఏ జిల్లాలో చూసినా జగన్ సభలకు జనం ఏ స్థాయిలో వచ్చారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మరోవైపు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు సైతం తాము గత ఐదేళ్లలో ప్రజలకు చేసిన మంచిని ప్రచారం చేసుకుంటూ ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

వైసీపీలో ధీమా కనిపిస్తుంటే అదే సమయంలో ఎల్లో నేతల్లో భయం కనిపిస్తోంది.వైసీపీ కనీసం 130 సీట్లతో విజయం సాధిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జగన్ పాలనలో సంక్షేమ పథకాల లబ్ధి పొందని కుటుంబం దాదాపుగా లేదనే సంగతి తెలిసిందే.

Advertisement

రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని వైసీపీ అభిమానులు సైతం చెబుతున్నారు.జగన్ పడ్డ కష్టానికి మరోసారి అధికారం రూపంలో ఫలితం దక్కబోతుందని ఈ విషయంలో వైసీపీకి తిరుగులేదని తెలుస్తోంది.కూటమి ఎన్ని పథకాలు ప్రకటించినా ఎన్ని మాటలు చెప్పినా ఆ మాటలు గాలిలో మాటలు ఓటర్లు ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది.

వైసీపీకి ఉత్తరాంధ్ర ఓటర్ల మద్దతు కూడా కలిసొస్తోంది.

బాబును నమ్మి ఇప్పటికే చాలా సందర్భాల్లో మోసపోయిన ఏపీ ఓటర్లు మరోసారి ఆయనను నమ్మి మోసపోవడానికి తాము సిద్ధంగా లేమని చెబుతున్నారు.మైనార్టీల ఓట్లు సైతం గుంపగుత్తగా వైసీపీకే పడే అవకాశాలు ఉన్నాయి.ఎన్నికల సమయానికి వైసీపీకి పరిస్థితులు ఒక్కొక్కటిగా కలిసొస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వైఎస్సార్ ను మించిన పాలన అందించడమే సీఎం జగన్ పాలిట వరం కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు