వైసీపీ కి తెలంగాణ లో 'నోటా' కంటే తక్కువ వచ్చిన స్థానాలు ఇన్ని ఉన్నాయా..జనసేన ఓట్లలో పావు శాతం కూడా లేదుగా!

రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ఘనవిజయం సాధించడం, రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అవ్వడం, ఇలాంటివి చకచకా జరిగిపోయాయి.

కానీ ఆంధ్ర పార్టీలలో ఒక్క జనసేన( Janasena ) తప్ప ఏ పార్టీ కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు సాహసం చెయ్యలేదు.

ఎందుకంటే పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో గతం లో వాళ్లకి అనుభవం అయ్యింది కాబట్టి.జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేసింది.

ఈ 8 స్థానాల్లో 7 స్థానాల్లో డిపాజిట్స్ కోల్పోగా, కేవలం కూకట్ పల్లి లో మాత్రం మంచి వోట్ షేర్ వచ్చింది.ప్రత్యర్థులు చాలా బలమైన వాళ్ళు అయ్యినప్పటికీ కూడా జనసేన పార్టీ కి 40 వేల ఓట్లు, అనగా 16 శాతం కి పైగా ఓటింగ్ వచ్చింది.

కేవలం పది రోజుల ముందే జనసేన తరుపున అభ్యర్థిని ప్రకటించారు.

Advertisement

మిగిలిన రెండు పార్టీలు కూకట్ పల్లి మొత్తం జనాలకు డబ్బులు ఒక రేంజ్ లో పంచి పెట్టారు.కానీ జనసేన పార్టీ అభ్యర్థి ముమ్మారెడ్డి( Mummareddy ) మాత్రం ఒక్క రూపాయి కూడా పంచలేదు.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కేవలం ఒక బహిరంగ సభ మరియు ఒక ర్యాలీ ని నిర్వహించారు.

ఇంత తక్కువ సమయం ఉన్నా కూడా పార్టీ కి అంత మంది ఓటు వేశారు అంటే సాధారణమైన విషయం కాదు.దీనిని అధికార వైసీపీ పార్టీ( YCP ) తేలికగా తీసుకుంటే మాత్రం పెద్ద దెబ్బ తిన్నట్టే.

సోషల్ మీడియా లో జనసేన పార్టీ కి తెలంగాణ లో డిపాజిట్స్ కోల్పోవడం తో జన సైనికులలో ఆత్మాభిమానం సన్నగిల్లింది అని, పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకోవడం జనాలకు నచ్చలేదని ఇలా ఎన్నో రకాలు గా ప్రచారం చేసారు.ఇదంతా పక్కన పెడితే 2014 వ సంవత్సరం లో వైసీపీ పార్టీ ఆంధ్ర తో పాటుగా తెలంగాణ లో కూడా పోటీ చేసాడు.

ఖమ్మం జిల్లాలో( Khammam ) మంచి అభ్యర్థులు ఉండడం వాళ్ళ ఒక ఎంపీ మరియు మూడు ఎమ్యెల్యే స్థానాలు వచ్చాయి కానీ, మిగిలిన అన్నీ చోట్ల నోటా( NOTA ) కంటే తక్కువ ఓట్లు నమోదు అయ్యాయి.పవన్ కళ్యాణ్ అంటే సినీ నటుడు, రాజకీయాలకు కొత్త, పార్టీ ని ఇంకా పూర్తి స్థాయిలో స్థాపించలేదు కాబట్టి డిపాజిట్స్ రాలేదు అనుకోవచ్చు.కానీ వై ఎస్ ఆర్ కొడుకు అనే ఇమేజ్ తో , ఓదార్పు యాత్ర పేరుతో వచ్చిన జగన్,( Jagan ) పెద్ద పెద్ద లీడర్స్ ని పెట్టినా కూడా నోటా కంటే తక్కువ ఓట్లు నమోదు చేసుకోగలిగారు అంటే, తెలంగాణ లో ఆయనకీ ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

జనసేన పార్టీ కి కూకట్ పల్లి లో వచ్చిన ఓట్లు 40 వేలు.కానీ వైసీపీ కి 35 స్థానాలకు కలిపి కనీసం 30 వేల ఓట్లు కూడా రాలేదు.

Advertisement

వైసీపీ పార్టీ నోటా తో పోటీపడిన స్థానాలు ఏమిటో ఒక్కసారి క్రింద చూడండి.

తాజా వార్తలు