Maharshi Srimanthudu : శ్రీమంతుడే కాదు మహర్షి కూడా కాపీ.. శరత్ చంద్ర సంచలన ఆరోపణలు వైరల్!

శ్రీమంతుడు సినిమా కథ కాపీ అని శరత్ చంద్ర( Sharat Chandra ) అనే రచయిత చేసిన ఆరోపణల వల్ల కొరటాల శివ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

శ్రీమంతుడు( Srimanthudu ) కథ విషయంలో కొరటాల శివ క్రిమినల్ కేసును ఫేస్ చేయాల్సిందేనని సమాచారం అందుతోంది.

అయితే కొరటాల శివ తాను నవల నుంచి ఈ సినిమాను కాపీ కొట్టలేదని ప్రూవ్ చేస్తే మాత్రం కొరటాల శివకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పవచ్చు.అయితే కొరటాల శివ( Koratala Siva ) శ్రీమంతుడు సినిమాతో పాటు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన మహర్షి కూడా కాపీ అని శరత్ చంద్ర చెబుతున్నారు.

భవిష్యత్తులో తాను కోర్టును ఆశ్రయిస్తానని శరత్ చంద్ర పేర్కొన్నారు.తాను సమాహారం అనే నవల రాయగా ఆ నవలలో రాసుకున్న సీన్లు మహర్షి సినిమా( Maharshi Movie )లో ఉన్నాయని ఆయన తెలిపారు.

అయితే శరత్ చంద్ర చేసిన ఈ కామెంట్ల గురించి మహర్షి నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి( Director Vamsi Paidipally ) నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Advertisement

సాధారణంగా సినిమా కథలు ఒక సినిమాను మరొకటి పోలి ఉంటాయి.కొంతమంది దర్శకులు సినిమా ఇండస్ట్రీలో ఉండేవి ఏడు కథలు మాత్రమేనని ఆ ఏడు కథలనే తిప్పితిప్పి సినిమాలు తీస్తామని చెప్పుకొచ్చారు.శరత్ చంద్ర చచ్చేంత ప్రేమ నవలకు కూడా రవితేజ నటించిన భగీరథ సినిమా( Bhageeradha )తో పోలికలు ఉన్నాయని ఇవే ఆరోపణలు చేస్తే ఆయన అంగీకరిస్తారా అంటూ కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

రాబోయే రోజుల్లో సినిమాలకు సంబంధించి ఈ తరహా కాపీ ఆరోపణలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది.మగధీర, బాహుబలి సినిమాలు( Baahubali ) విడుదలైన సమయంలో ఈ సినిమాల కథలకు కూడా ఇతర సినిమాలతో, ఇతర నవలలతో పోలికలు ఉన్నాయని కామెంట్లు వినిపించాయి.కొరటాల శివ రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు